
RYTAANGA PORATAM
₹40
In stock · 113 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageEnglish
చల్లపల్లి ఎస్టేట్ -రైతాంగ పోరాటం ముందుమాట చల్లపల్లి ఎస్టేటు రైతుల పోరాటం ఎలా వచ్చింది? మా స్వగ్రామము దివి తాలూకా మోపిదేవి శివారు రావి వారి పాలెం గ్రామము. మాది రైతు కుటుంబము, ఈ ప్రాంతాన్ని చల్లపల్లి జమీందారీ ఏరియా అనేవారు. పూర్వం రైతులు విద్యా విహీనులగుట వల్ల, మెట్ట పైరులు పండీ పండక జమీందారుకు శిస్తులు కట్టలేక చాలా బాధలు పడేవారు. ఈ దేశంలో బ్రిటిషు రాజుల ప్రభుత్వం ఒకటి ఉన్నదని ఈ రైతులకు తెలిసేది కాదు. చల్లపల్లి జమిందారునే 'రాజు' అనుకొనేవారు. చల్లపల్లి జమీందారు పెట్టే బాధలను నా చిన్నతనంలో మా కుటుంబానికి జరిగిన ఒక అన్యాయ సంఘటనను ఉదహరిస్తాను. మాకు ప్రక్క గ్రామమైన 'పెదప్రోలు'లో రెండు ఎకరాల మెట్ట భూమి ఉన్నది. దీనికి జమీందారుకు శిస్తు చెల్లించేవారు. ఆ రోజుల్లో గ్రామ కరణాలే జమీందారు శిస్తు వసూలు చేసే 'సముద్దారు'లుగా ఉండేవారు. మా పెద్దలు చదువుకొన్నవారు, ఈ పెదప్రోలు గ్రామ కరణం రైతులను పెట్టే బాధలను ఎదుర్కొనేవారు. దానికేమో కక్ష కట్టిన కరణం, ఆ గ్రామంలోని మా భూమికి ఒక అణా (రూపాయికీ 16 అణాలు) బాకీ ఉన్నదని కోర్టులో జమీందారు తరఫున దావా వేసి ఆ కోర్టు నోటీసులు మా నాయనకు రాకుండా చేశారు. ఇది తెలియని మా నాయన శివరామయ్యగారు కోర్టుకు వెళ్లలేదు. దానిపై జడ్జి శిస్తు బాకీ క్రింద మా రెండు ఎకరాలు జమీందారుకు చెందుతుందని తీర్పు చెప్పారు. తరువాత ఈ విషయం తెలిసికొన్న మా నాయన ఈ కేసుపై, పై కోర్టుకు అప్పీలు చేశాడు. విచారణలో జడ్జికి మా నాయన అంతకుముందే కట్టిన శిస్తు రశీదు చూపాడు. రశీదులో 'ఝాడాగా' (పూర్తిగా) శిస్తు కట్టినట్లు కరణం వ్రాసిన రశీదు చూచిన జడ్జి కరణాన్ని అడుగగా, అతని భూమి కొంచెం పెరిగిందని, అందుకు ఒక అణా పెంచానన్నాడు. దానిపై జడ్జి మీ గ్రామంలో భూమి ఎన్నాళ్ళకొకసారి పెరుగుందని అడుగగా, అలా పెరగదని, ప్రక్క రైతు చేలో ఈ రైతు కొంత ఆక్రమించుకొన్నాడని చెప్పాడు. దానిపై జడ్జి ప్రక్క రైతుకు అణా తగ్గించావా? అని అడుగగా కరణం మాట్లాడలేదు. దానిపై జడ్జి 50 రూపాయలు జమీందారుకు జరిమానా వేశాడు. ఇదే జమీందారుకు మొదటిసారిగా జరిమానా వేయడం. మా పెద్దలందరూ 1920 నుండి కాంగ్రెసు వాదులు. చదువుకున్నవారు. మా పెద్ద తండ్రి శ్రీ కావూరి కోదండ రామయ్యగారు 1923లో జమీందారీ అభ్యర్థులను ఓడించి కృష్ణాజిల్లా బోర్డు ఉపాధ్యక్షుడుగాను, తరువాత Educational Council అధ్యక్షుడుగాను ఉన్నారు. వీరితోపాటు కాంగ్రెసు వాదులుగా ఉన్న ఈ తాలూకా వారు శ్రీయుతులు గొట్టిపాటి బ్రహ్మయ్య, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య (కిసాన్), కొడాలి ఆంజనేయులు,