SAADRUSHYAM by B.V.SIVAPRASAD Telugu book cover

SAADRUSHYAM

by B.V.SIVAPRASAD

₹100
In stock · 90 available
PublisherB.V.SIVAPRASAD
LanguageTelugu
సాదృశ్యం "వక్కింటి వాళ్ళబ్బాయిని చూడు టిసిఎస్ లో జాబ్ వచ్చింది. నువ్వున్నావెందుకు? బి.టెక్ పాసయ్యి ఎనిమిది నెల్లవుతున్నా, ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. స్నేహితుల ముందు నా పరువు పోతూ ఉంది" అన్నాడు పాపారావు. విన్న ఆనంద్ ఏం మాట్లాడలేదు. మౌనంగా బయటకు వెళ్ళిపోయాడు. నిజానికి చాలా రోజులనుంచి అతను అలాగే ఉంటున్నాడు. చిన్నప్పట్నుంచి తనని ఇతరులతో పోల్చటం వాళ్ళకు అలవాటుగా మారింది. బాల్యంలో అతను బక్కగా ఉండేవాడు. మేని ఛాయ కూడా ఒకింత తక్కువగా ఉండేది. వాళ్ళ నానమ్మ 'ఏంటి వీడిలా ఉన్నాడు? తాయారమ్మ గారి మనవడు వీడికంటే మూజ్జెల్లు చిన్న వాడైనా ఎంత బొద్దుగా, ముద్దుగా, ఎర్రగా మెరిసిపోతూ ఉంటాడో' అనుకునేది, పైక్కూడా చాలా సార్లనేది. దీనికి మిగతా వాళ్ళు కూడా వంత పాడే వారు. ఎల్ కే జీ నుంచి ఇంజనీరింగ్ చదువు వరకు ఆనంద్ ఇతరులతో ఎన్ని సార్లు పోల్చబడ్డాడో లెక్కే లేదు. ఈ హింస ఎంసెట్ పరీక్ష తర్వాత మరీ ఎక్కువయ్యింది. అతనికి 24000 ర్యాంకు వచ్చింది. కానీ ఇంకో నేషనల్ లెవెల్ ఎగ్జాంలో మంచి ర్యాంక్ రావడం వల్ల, జమ్లాడ్పూర్లో బయో టెక్నాలజీలో సీట్ వచ్చింది. అక్కడికెళితే చెడు అలవాట్లు చేసుకుంటాడేమోననే భయంతో అక్కడ జాయిన్ చెయ్యలేదు. చివరికి ఉన్న ఊళ్ళోనే మరీ కొత్త, పాతా కాని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అతన్ని మెకానికల్ బ్రాంచ్ లో చేర్పించారు. ఎంసెట్లో ఇంకా మంచి ర్యాంక్ వచ్చుంటే, సిటీలోనే ఇంకా మంచి కాలేజ్ లో ప్రవేశం దొరికుండేదని పెద్ద వాళ్ళ సహజ భావన. ఐతే అతణ్ణి అయినదానికి, కాని దానికి, ఇతరులతో పోల్చటం మూలాన అతను అంతర్ముఖుడుగా మారాడేమో! ఆనంద్ ఎక్కువగా ఎవ్వరితోనూ మాట్లాడే వాడు కాదు. ఎవరైనా తిట్టినా చిర్నవ్వో, మౌనమో అతని ప్రతి స్పందనల్లుగా ఉంటాయి.