SAAKIREVU KATHALU by GOVIND MURISETTY Telugu book cover

SAAKIREVU KATHALU

by GOVIND MURISETTY

₹120
In stock · 54 available
PublisherGOVIND MURISETTY
LanguageTelugu
ముందుమాట నా వయస్సు ఈ రోజుకు సరిగ్గా 108 ఏండ్లు. ఏమిటిదని ఆశ్చర్యపోతున్నారా? మీతో నేను చెపుతున్నది నిజమే. ఐతే నా వయస్సును ఇంత పెంచింది మాత్రం 109 సంవత్సరాలున్న మూరిశెట్టి గోవిందే. ఎందుకంటే ఆయన ఆరునెలల కిందట 'సాకిరేవు కతలు' పేరుతో 20 కథలు రాసి పుస్తకం వేస్తున్నాను ముందుమాట ఎలా సార్! అని ఆర్.ఎం. ఉమా మహేశ్వరరావు గారిని అడిగితే పేరూరు బాలసుబ్రమణ్యం దగ్గర రాయించమని చెప్పాడని నా వద్దకు వచ్చి తిరుగులేని బాణం వేసాడు. ఇంకేముంది గురి తప్పని బాణం తగిలి పుస్తకంలో పడ్డాను. చదవడం మొదలుపెట్టడమే నా వంతు. చదువుతుంటే నా మనసు అక్షరాల వెంబడి పరుగెడుతుంటే నా వయసు అంతకంటే వేగంగా వందేండ్లుదాటి 108కి వచ్చి ఆగింది. పూర్వకాలంలోని గ్రామాలలో జీవితం తెలుసుకోవాలన్నా, ప్రతి కుటుంబంలోని సాధక బాధకాలు దగ్గరగా వినాలన్న అవకాశం ఉండేది అతికొద్ది మందికి మాత్రమే. అలా కుటుంబంలో ఒక సభ్యుడిలాగా ఆత్మీయంగా కలిసుండే వారిలో చాకలి కూడా ఒకరు. రచయిత తెలివిగా చాకలి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తన కథల ద్వారా ఆనాటి పల్లెజీవనాన్ని, పండుగలు పబ్బాలను, ఆచార వ్యవహారాలను, సామెతలు జాతీయా లను అద్భుతంగా చెప్పగలిగాడు. అంటే 56 సంవత్సరాలు వయసుగల రచయిత తను చిన్నప్పుటి నుండి ఇప్పటివరకు చూసిన పల్లెలు ఎలా వుండేవి. తనకు ముందుతరం అంటే యాభై అరవైయేండ్లకు పూర్వం తన పెద్దలకాలంలో ఎలావుండేవి అన్న విషయాలను వెనక్కెళ్ళి చెప్పడం అలా ఆ తరం ఈతరం కలిపి రచయిత వయసు 109 సంవత్సరా అన్నది నా భావన. సాకిరేవుబండ బట్టలకున్న ఎంతటి మురికినైనా వదలగొట్టి శుభ్రం చేస్తుంది. ఈ సాకిరేవు కథలు మనిషిలోని మాలిన్యాలను తొలగించి మంచిగంథం పూయిస్తాయి.