
SABDATEETHA GNANAM
₹200
In stock · 6 available
PublisherSWAMI SUKHABODHANANDA
LanguageTelugu
కెరటంలా శక్తివంతంగా ఉండు మనం ఎలా ఉండాలనుకుంటామో అలా మనం మారతాము. ఆలోచనలకు చాలా బలం ఉంది. మన ఆలోచనలు శక్తివంతంగా ఉంటే మనమూ బలం పుంజుకుంటాము. బలహీనంగా ఆలోచిస్తే అలాగే తయారవుతాము. మనకు కనిపించే ప్రపంచం కంటే, మన భావనామయ ప్రపంచం బలమైనది. మన ఆత్మకు ఆహారం ఆలోచనలే. అందుకే పుష్టికరమైన ఆహారంలాగే, మంచి ఆలోచనలు ఎంచుకోవాలి. ఒక వస్తాదు తన గురువుగారి దగ్గర కెళ్ళి -స్వామీ, నేను ఒంటరిగా మిమ్మల్ని కూడా ఓడించగలుగుతున్నాను. కానీ వాస్తవంలో నాకంటే చాలా బలహీనంగా ఉన్నవాడిపై కూడా గెలుపు సాధించ లేకపోతున్నాను. ఎందుకని? - అని అడిగాడు. అప్పుడు ఆ గురువుగారు అతన్ని ఒక సముద్రం దగ్గర కూర్చుని నీవు ఒక కెరటంగా మారిపోయినట్లు ఊహించుకో అని చెప్పారు. అతను ఒడ్డున కూర్చుని ధ్యానంలో మునిగిపోయాడు. ఎన్నో ఆలోచనలు అలల్లా తన్నుకొచ్చాయి. కానీ అతను తనొక శక్తివంతమైన కెరటంగా ఊహించుకుంటూ ధ్యానం చేసాడు. అప్పటినుండీ అతను అన్ని కుస్తీ పోటీల్లోనూ విజయం సాధించాడు. అందుకే ఎప్పుడూ మీరు మంచివారుగా, ప్రేమగా, శక్తివంతులుగా తయారవ్యాలని అనుకోండి. మన ఊహల్ని బట్టే మన ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి. మనకెవరైనా చెడ్డవాళ్ళుగా అనిపిస్తే, అది మన ఆలోచనల రూపమే. అది సరైనది కాదు. మనల్ని గురించి ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు. అందుకని మన ఊహల్ని, ఆలోచనల్ని చక్కగా రూపొందించుకుని అలా జీవించడం విజ్ఞత, వివేకం. మనం ఆనంద స్వరూపులమని, అనంతాత్ములమని వేదాలు బోధిస్తాయి. - అహం బ్రహ్మస్మి !