
SAGIRAVE SARIGAMALA
by RASARAJU
₹250
In stock · 16 available
PublisherRASARAJU
LanguageTelugu
రసోదయం జీవితకాలంలో చక్కనివాళ్లు కొందరు పరిచయం కావడం, ఆత్మీయులు కావడం కూడా ఒక యోగం. అలా ఒక సినారె (నా పాటల తండ్రి నాకు ప్రాతఃస్మరణీయుడు) ఒక దాసరి (నాలోని సంపూర్ణ రచయితను గుర్తించి ఆదరించి పరిచయంచేసిన దర్శకదేవుడు) ఇలా ఈ వరుసలో వేళ్లమీద లెక్కించదగిన కవిరసజ్ఞుల పరిచయంలో ఒక జె.కె.భారవి అన్నలా, ఒక రసరాజు సోదరుడు. చెన్నపురిలో మొదట, భాగ్యనగరిలో మరోసారి అలా అలా ఏర్పడిన అన్నతో పరిచయం ఆ తరువాత స్నేహమై, ఆత్మీయమై, ఆరాధ్యమయింది. పద్యకవి, గేయకవి, గజల్ మొగల్, మినీకవితాగని - వెరశి “రసరాజు” అనే రంగినీని సత్యనారాయణరాజు. ఆయన రసాలూరే కలంనుండి జాలువారిన శిరోధార్యమైన మణిమకుటపద్యం “భిక్షకై ఎందరో వినువీధివైపు గిన్నెలెత్తినవేళ నా పున్నెమేమొ ఈ కవిత్వమ్ము పోసి దీవించితీవు స్వామి! మరల నీకదె సమర్పణము సేతు” ఈ పద్యం విన్నపుడు - ఈ మహార్ద్రతా కవిని చూడగలనా అనుకొన్నా. నేను చూడగలిగాను. కరచాలనం, ఆలింగనంతోపాటు నా పాటలకు తన ఆశీర్వచనం అందుకోగలిగాను.