SAHASI - NOVEL by SURYADEVARA RAMMOHANA RAO Telugu book cover

SAHASI - NOVEL

by SURYADEVARA RAMMOHANA RAO

₹200
In stock · 10 available
PublisherMADHUPRIYA PUBLICATIONS
LanguageTelugu
సాహసి క్రీస్తు పూర్వం 1300 ఈజిప్టు దేశం... కైరోకి దక్షిణాన ఉన్న- ఎల్ గిజా... ఎడారి భూముల్ని, బిడారు ప్రాంతాలను సస్యశ్యామలం చేసే నైలునది ప్రపంచదేశాలకు అత్యున్నతమైన నాగరికతను అందించేందు కన్నట్లు ఉరవళ్ళు- పరవళ్ళతో ఇసుక ఎడారుల మధ్య నుంచి ప్రవహిస్తోంది. అప్పటికే ఈజిప్టు నాగరికత ఆ ప్రాంతంలో పాదుకొని 1900 సంవత్సరాలు అవుతోంది. అప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటలు. ఎల్గిజా పిరమిడ్స్ ముందు విచిత్రమైన వేషధారణలో ఒకరాజు నుంచుని క్రీస్తుపూర్వం 2580లో నిర్మించిన ఒక పిరమిడ్ కేసే దీర్ఘంగా చూస్తున్నాడు. తన పూర్వీకుల వైభవాన్ని తలచుకొని పరవశించిపోతున్నాడు. అది ఈజిప్టు ప్రధాన రాజవంశానికి చెందిన చెయోప్స్ పిరమిడ్.