SAHITHI SOWGANDHAM by RAGHAVA SARMA Telugu book cover

SAHITHI SOWGANDHAM

by RAGHAVA SARMA

₹100
In stock · 55 available
PublisherRAGHAVA SARMA
LanguageTelugu
నా మాట సైన్స్ విజ్ఞానాన్ని కలిగిస్తే, సాహిత్యం సంస్కారాన్ని కలిగిస్తుందంటారు. ఆ సంస్కారం చిత్తూరు జిల్లాలో ఏమాత్రం కొదువలేదు. 'సాక్షి' జిల్లా అనుబంధంలో 'సాహితీ నేత్రం' పేరుతో ఒక ఏడాది పాటు (2009-10) వారం వారం వచ్చిన సాహిత్య పేజీలే ఇందుకు నిదర్శనం. ఆ పేజీల్లో వచ్చిన సాహితీవేత్తల గురించిన కథనాల సమాహారమే ఈ 'సాహితీ సౌగంధం' ఇందులో మరికొన్ని కూడా చేర్చాం. జిల్లాకు చెందిన సాహితీవేత్తల గురించే కాకుండా, తమ జీవితాలను ఈ నేలతో పెనవేసుకున్న సాహితీవేత్తలను కూడా పరిచయం చేయాలనుకున్నాం. వారి రచనలతోపాటు, రేఖా మాత్రంగా జీవిత విశేషాలను, వ్యక్తిత్వాలను ఆవిష్కరించాలని ప్రయత్నించాం. వారికి సన్నిహితంగా ఉన్న వారి చేత, వారి గురించి బాగా తెలిసిన వారి చేతే రాయించాం. తొలుత ఒక తరం సాహితీవేత్తల గురించి మొదలు పెట్టాం. ఎంతో స్పందన వచ్చింది. ఒక ఏడాది పాటు నిర్విఘ్నంగా సాగింది. పాత తరంలోనే ఇంకా కొందరి గురించి, ఆ తరువాతి తరం గురించి కూడా రాయించాలనుకున్నాం. కొన్ని అనివార్యకారణాల వల్ల 'సాహితీ నేత్రం' కొనసాగించలేకపోయాం. దినపత్రికల్లో ప్రతి అంగుళమూ విలువైందే. ఒక ఏడాదిపాటు జిల్లాలో సాహిత్యానికి ఇంత స్థలాన్ని కేటాయించడం చిన్న విషయం కాదు. అందుకు పత్రిక యాజమాన్యానికి, సంపాదకవర్గానికి కృతజ్ఞతలు. ఈ 'సాహితీ సౌగంధం'లో వచ్చిన సాహితీవేత్తలు భిన్న ఆలోచనలు, ప్రాపంచిక దృక్పథాలు, తాత్విక చింతనలు కలిగినవారు. భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామిక లక్షణం. అయితే, ఈ భిన్నత్వంలో ప్రజల గురించి పట్టించుకునే సంస్కారమనే ఏకత్వం ఉంది. ఆ ఏకత్వమే ఈ మహానుభావులందరినీ ఈ పుస్తకంలో ఇలా ఒక చోట చేర్చింది. ఎంత మంది కవులు! ఎంత మంది రచయితలు! ఎంత మంది భాషాశాస్త్రవేత్తలు! వారిగురించి తెలుసుకుంటుంటే ఆనందమేకాదు, ఆశ్చర్యమూ వేస్తుంది. ఈ జిల్లాకు వచ్చిన కొందరు సాహిత్య అతిథులను కూడా పరిచయం చేయడానికి వారితో చేసిన ఇంటర్వ్యూలను చివరలో అనుబంధంగా ఇచ్చాం. ఈ రచనలు చేసిన సాహితీవేత్తలందరికీ కృతజ్ఞతలు. ఈ పుస్తకం అచ్చవడానికి సహకరించిన శ్రీమతి నాగసూరి హంసవర్దిని గారికి, సాకం నాగరాజుగారికి, పలమనేరు బాలాజీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. -రాఘవశర్మ సాహితీ సౌగంధం