
SAHITHI VYASALU SAMEEKSHALU
by C.SUBBARAO
₹90
In stock · 327 available
PublisherC.SUBBARAO
LanguageTelugu
విమర్శాదర్శం ఆత్మీయులు వెలిచాలకొండలరావు, మాదిరాజు రంగారావుగారల ద్వారా నా గురించి విన్న సుబ్బారావు గారు ఫోన్లో తన్ను పరిచయం చేసుకొని, ఆ తర్వాత సరాసరి మా ఇంటికి వచ్చి నా చేతిలో ఈ పుస్తకాన్ని పెట్టారు. ఇది వ్యాస త్రయోదశి. విశిష్టమైన 'సాహితీవ్యాసాలు - సమీక్షల' సమాహారం. పుస్తకం తెరవగానే వ్యాసాలు నాచేత ఏకబిగిన చదివింపజేశాయి. పఠితల నాకట్టుకొనే వర్ణనాత్మక వచన రచనాశైలి, విలక్షణమైన వివేచనా రీతి, భావ ప్రకటనలో సృష్టత ఇందలి ప్రత్యేక గుణాలుగా భాసించాయి. మరొక విశేషం ఏమిటంటే రచయిత వ్యక్తపరచిన అభిప్రాయాలతో నేను చాలా వరకు ఏకీభవించటం వల్ల మా ఇద్దరిలో ఏదో ‘హృదయ సంవాదం' గోcoom మొదటి వ్యాసంలో ప్రస్థావింపబడిన శ్రీ పరమహంస యోగానంద స్వామివారి దివ్యగ్రంధం 'Autobiography of a Yogi ' (ఒక యోగి స్వీయ చరిత్ర) చదవటమే ఒక మహానుభూతి. ఆ మహదావకాశాన్ని పొందిన సుబ్బారావు గారికి యోగానంద స్వామి వారి ఇంకా వారి పరమగురు పరంపర పరిపూర్ణ కటాక్షం సిద్ధించుగాక అని మనఃపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ఈ దివ్యగ్రంధ పరిచయం కలగటం నాకు లభించిన మహద్భాగ్య విశేషంగా భావిస్తున్నాను. 'కవిత్వంలో శ్రీశ్రీ ప్రస్థానం - పరిణామం' అన్న మలివ్యాసం శ్రీశ్రీ కవిత్వతత్త్వాన్ని వినూత్న కోణం నుంచి ఆవిష్కరించింది. మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందని తెలియని తొలిదశలో వెలువడిన మహాప్రస్థానంలోని నిరసన ఒక తాత్త్విక చింతన ననుసరించి వచ్చింది కాదు. “మార్పిజానికి, విప్లవ సాహిత్య ఆలంకారిక కట్టుబాట్లకు ఆయనలోనైన తర్వాత కవిగా ఆయన స్వతంత్రం కోల్పోయారు. సిద్ధాంత ప్రవచనం తన కర్తవ్యంగా స్వీకరించి, తన కవితా వ్యాసంగంపై మార్క్సిస్టు సిద్ధాంతానికి పెత్తనం అప్పజెప్పారు,” (పుట. 5) అని సుబ్బారావుగారి నిశ్చితాభిప్రాయం. మహాప్రస్థానంలోని కవితాశిల్పం తర్వాతి రచనల్లో (ఖడ్గసృష్టి మొ||) ఏ విధంగా లోపించిందో సోదాహరణంగా నిరూపించారు. అయినా ఆయన కొచ్చిన లోటులేదని, మహాప్రస్థానం చాలా గొప్పకవిగా ఆయనకు శాశ్వత స్థానం కల్పించిందని ఉగ్గడించారు. "కవిత్వానికి స్వావలంబన, స్వయం ప్రతిపత్తి ఉండటం వల్ల అది సార్వభౌమాధికారం కలిగి ఉంటుంది. ఏ సామాజిక స్పృహకో, ఏ రాజకీయ ఆర్థిక సామాజిక తాత్విక ఆధ్యాత్మిక