SAHITHYA VARADHI by DR.VENNA VALLABHAVA RAO Telugu book cover

SAHITHYA VARADHI

by DR.VENNA VALLABHAVA RAO

₹125
In stock · 2 available
PublisherDR.VENNA VALLABHA RAO
LanguageTelugu
పుస్తకం గురించి .... భిన్న భాషలకు నెలవైన భారతదేశంలోని సమస్త భాషల సాహిత్యాల్ని గమనిస్తే, వాటన్నింటిలోను దాదాపు ఒకే రకమైన ఇతివృత్తాలు, భావాలు, విశ్వాసాలు, తత్త్వాలు పడతాయి. కాని ఒక ప్రాంతంలో నివసించే వారికి అన్యభాషా సాహిత్యాల విశేషాలు తెలియకపోవటం వల్ల పరస్పర వైషమ్యం, వైముఖ్యం, ద్వేషం ప్రబలి దేశ సమైక్యతకు, సమగ్రతకు ముప్పు ఏర్పడుతుంది. భాషావైవిధ్యం భారతావని ఐక్యతకు పెద్ద అవరోధం. 'భాషలు వేరైనా భారతీయ సాహిత్యపు ఆత్మ ఒక్కటే' అన్న విషయాన్ని నిరూపించి ప్రచారం చేసే విషయంలో మనం చాలా వెనుకబడ్డాం. అందువల్ల భాషల మధ్య విభేదాలు, భిన్న భాషీయుల మధ్య వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భిన్న భాషా సాహిత్యాల్లోని సారూప్యాల్ని జాతి ముందుంచి వారిలో సామరస్య భావాల్ని పెంపొందించటం, వాటి మధ్య వారధి నిర్మించటం, భావసమైక్య సాధనకు కృషి చెయ్యటం ఎంతైనా అవసరం. ఆ అవసరం నుంచి పుట్టిందే తులనాత్మక సాహిత్య పరిశోధన. ఈ పరిశోధన ఒక భాషా సాహిత్యాన్ని మరొక భాషా సాహిత్యంతో పోల్చి వాటిలోని సారూప్య భేదాలను తెలియ జెప్పటానికి, పరస్పర అవగాహనకు, భావసమైక్య సాధనకు ఎంతగానో దోహదపడుతుంది. ఒక భాషా సాహిత్యంలో ఉన్న ఇతివృత్తాల్ని, రచయితల సృజనాత్మక ప్రతిభని, వర్ణనా వైదుష్యాన్ని ఇతర భాషల వారికి తెలియపరిస్తే, తమ భాషా సాహిత్యాలతో సరిపోలిన ఇతివృత్తాల్ని, భావాల్ని, సాహిత్య ధోరణుల్ని వాటి మధ్య సారూప్యాల్ని అవగతం చేసుకోవటానికి అవకాశం కలుగుతుంది. భిన్న భాషా సాహిత్యాలలోని పలు అంశాల్ని ఇతర భాషల వారికి పరిచయం చెయ్యటం, వాటిని తులనాత్మకంగా పరిశీలించి అందించటం మరింత ప్రయోజనకారిగా ఉంటుంది. భారతజాతి సమస్తాన్ని సమైక్యపరిచిన చరిత్ర హిందీభాషకి ఉంది. జాతీయ భాషగా ప్రచారానికి నోచుకుని దేశప్రజలందరి అభిమానాన్ని, ప్రేమని చూరగొన్నది. హిందీ సాహిత్య సౌరభం దేశమంతా పరివ్యాప్తమైంది. ప్రాంతీయ భాషల సాహిత్యాన్ని సహితం ప్రభావితం చేసింది. ముఖ్యంగా జాతీయభాషని ఎనలేని గౌరవంతో ఆదరించిన తెలుగు రచయితల్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఈ ప్రభావమే హిందీ-తెలుగు సాహిత్యాల తులనాత్మక పరిశోధనకు, భావసారూప్యాల అన్వేషణకు, తద్వారా సమైక్యతా సాధనకు బాటలు ఏర్పరచింది. తెలుగు-హిందీ భాషల్ని నేర్చుకుని, వాటి సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వారెందరో ఈ దిశగా కృషి చేశారు.