SAHITYA SOUGANDHIKA by ACHARYA S.GANGAPPA Telugu book cover

SAHITYA SOUGANDHIKA

by ACHARYA S.GANGAPPA

₹65
In stock · 80 available
PublisherSASI PRACHURANALU
LanguageTelugu
సంపాదకీయం...... మానవజన్మ విశిష్టమైంది అంటారు. అటువంటి మానవునిగా జన్మించి నిండు నూరేళ్లు బ్రతకాలని కోరుకుంటారు. "శతాయుష్మాన్ భవతి" అని పెద్దలు ఆశీర్వదిస్తారు. పుట్టుక, వృద్ధి, మరణం అనేవి ప్రతి ప్రాణికి ఉంటాయి. మానవ పురోభివృద్ధిలో ఎన్నో నూతన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విద్యాప్రమాణాలు, ఆరోగ్య ప్రమాణాలు అధికమౌతున్నాయి. అంచెలంచెలుగా ఎదిగి 75 వసంతాలు పూర్తి చేసుకోవడం, వయస్సుతోపాటు పండిన మానసిక పరిపక్వత కలిగివుండటం మా గురుదేవులు ఆచార్య గంగప్పగారి సొత్తని భావిస్తున్నాం. వయస్సు పెరిగేకొద్దీ ఆచార్యకత్వంతోపాటు ఆలోచనాపరిధి విస్తృతమై రచనావ్యాంగం మూడుపూలు ఆరుకాయలుగా వర్ధిల్లడం ఆచార్య గంగప్పగారి జీవితంలో విశిష్టాంశంగా పేర్కొనవచ్చు. ఇప్పటికే ఆచార్య గంగప్పగారి శిష్యప్రశిష్యులు, కుటుంబ సభ్యులు, సాహిత్యాభిమానుల సమక్షంలో షష్టిపూర్తి పండుగ, సప్తతి పండుగలు నిర్వహించడం, ఆయా పండుగల సందర్భంగా వారి జీవితం రచనా వ్యాసంగంపై ప్రత్యేక సంచికలు వెలువరించిన విషయం పాఠకులకు తెలిసిన అంశమే. ఆ విధంగానే 2011వ సంవత్సరంలో ఆచార్య గంగప్పగారి 75 వసంతాల పండుగ ఘనంగా నిర్వహించడంతోపాటుగా, వారి జీవితం, రచనలకు సంబంధించి ప్రత్యేకంగా 2006 2011 మధ్య వెలువడిన రచనలపై సమగ్ర విశ్లేషణతో ఆచార్య గంగప్ప 75 వసంతాల ప్రత్యేక సంచిక "సాహితీ సౌగంధిక”ను ప్రచురిస్తున్నాం. ఆచార్య గంగప్పగారు తమ జీవితకాలంలో 80కి పైగా రచనలు వెలువరించడం పేర్కొనదగిన అంశం. అందుకు తగినట్లుగా అవార్డులు వారికి దక్కాయి. వారి దృష్టి రచనా వ్యాసంగంపై కేంద్రీకృతం కావడం ప్రశంసనీయం. శ్రీ గంగప్పగారు నిండు నూరేళ్లు పరిపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లాలని, వారి రచనా వ్యాసంగం కొనసాగాలని ఆశిస్తున్నాం.