SAHITYA TORANALU by MUVVALA SUBBA RAMAIAH Telugu book cover

SAHITYA TORANALU

by MUVVALA SUBBA RAMAIAH

₹120
In stock · 16 available
PublisherJAYANTHI PUBLICATIONS
LanguageTelugu
మువ్వల సవ్వడులు - వాఙ్మయ విశేషాలు సాహిత్య తోరణాలు పేరిట మువ్వల సుబ్బరామయ్యగారు అందిస్తున్న సంపుటి ఇది జయంతి పబ్లికేషన్స్కు అటు ప్రచురణ రంగంలోనూ ఇటు సాహిత్యరంగంలోనూ పేరు ప్రఖ్యాతులు తక్కువేమీ కాదు. గతంలో కూడా మువ్వల అనేక సాహిత్య సంబంధ అంశాల మీద గ్రంథాలు రాశారు. పబ్లిషింగ్ రంగంలోని ఒడిదుడుకులు, సమాజంలో వచ్చిన పరిణామాలు, ఇతర మార్పులు ఏవైనప్పటికీ అనేక ప్రచురణ సంస్థలు క్రమేణా కనుమరుగయ్యాయి. కొన్ని అవుతూ ఉన్నాయి. జయంతి పబ్లికేషన్స్కు గల ఖ్యాతిని దృష్టిలో ఉంచుకుని కొన్నైనా ఇటువంటి ప్రచురణలు వెలువరించడం సుబ్బరామయ్యగారు విధిగా పాటిస్తూ వస్తున్నారు. పుస్తకాల మీద ప్రేమ, సాహిత్యం పట్ల అభిరుచి దశాబ్దాలుగా జీవితం ఈ రంగానికే అంకితం కావటం, కారణం ఏదైతేనేమీ రచయిత ఇటువంటి కృషిని ఓపినంత మేరకు కొనసాగిస్తున్నారు. ఇందులో గల తొలి రెండు వ్యాసాలు సాహిత్య సంబంధితమైనవే అయినా కొంచెం భిన్నం. మొదటిది సాహితీభోజనాలు, రెండవది సాహితీ కలహభోజనాలు. ఈ రెండూ. రుచిని, అభిరుచిని పెంపొందించేవిగా ఉన్నాయి. సుప్రసిద్ధ సాహితీవేత్తలు భోజనం గురించి ఏం చేశారో ఉటంకిస్తూ, అవసరమైన చోట రచయిత ప్రమేయం కల్పించుకుని సంక్షిప్తంగా వ్యాఖ్యానిస్తారు. మిగిలిన వాటిల్లోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. సాహితీమూర్తుల భోజన ప్రియత్వంతో పాటుగా, వారు భోజనం చేసేందుకు పడ్డ అగచాట్లు ఇబ్బందులు వారి వారి జీవిత అనుభవాల్లోంచి వెలికి తీసి ముందుపెట్టారు. ఇవి గొప్ప సాహితీమూర్తుల వ్యక్తిత్వ విశేషాలను తెలుసుకునేందుకు దోహదపడతాయి. భోజనాల గురించి ఎన్ని విశేషాలు పేర్కొన్నారో సాహితీ కలహభోజనాల గురించి అన్ని విశేషాలు తెలిపారు. ఇవి చదువుకోడానికి హృద్యంగా అనిపిస్తాయి. మంచి పరిశోధకుడు ఈ రెండు విషయాల మీద పరిశోధించాలే గాని ఎన్నో అంశాలు సాహిత్యప్రియులకు విందుభోజనంగా ఆవిష్కరించే వీలుంది. మూడవ వ్యాసం జాతి చరిత్ర నిర్మాణంలో రచయితల పాత్ర ఎంత ఉందో తెలుపుతుంది. ఉద్యమాలకు ఊపిరిగా తెలుగు సాహిత్యం నిలబడిన తీరును ఈ వ్యాసం వివరిస్తుంది. 'బాపట్ల నుండి భాగ్యనగరం' అన్న వ్యాసం తెలుగువారి రాజకీయ, సాంస్కృతిక రాజకీయ చరిత్రను, 'ఆంధ్రమహాసభ' అవిరళకృషిని వివరిస్తుంది. మహామహులు, ఉద్ధండులు ఈ నేలలో ప్రసరింపజేసిన చైతన్యరేఖలను రేఖామాత్రంగా వివరిస్తుంది.