
SAMAJAM
₹20
In stock · 671 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
'ఈ సమాజం మారదోయ్', 'ఈ సమాజాన్ని మార్చడం ఎవ్వరి వల్లా కాదు' లాంటి మాటలు చాలా తరచుగా వింటాం. సమాజం అస్సలు మారకపోతే మనం ఇంకా ఆటవిక దశలోనే ఉండే వాళ్ళం కదా! 'ముందు మనుషులు మారకుండా సమాజం ఎలా మారుతుంది?' 'ప్రతీ వ్యక్తీ మారితే సమాజం అదే మారుతుంది' లాంటి వ్యాఖ్యల సారాంశం ఏమిటంటే మనుషుల మొత్తమే సమాజం తప్ప సమాజానికి అదనపు ప్రత్యేకతలేవీ లేవు. 'ముందు సమాజం మారితేనే మనుషుల్లో మార్పు వస్తుంది'అనే వాదన ఒప్పుకుంటే వ్యక్తులకు అతీతంగా, వారి ప్రమేయం లేని సమాజం ఉంటుందా? వ్యక్తిత్వ వికాసం పేరుతో బూర్జువా వ్యక్తి వాదాన్ని ప్రబోధించే వారు 'సమాజాన్ని పట్టించుకోకు, నీ బాగు నువ్వు చూసుకో' అని చెవినిల్లు గట్టుకొని పోరుతుంటారు. సమాజంలో కాక వ్యక్తి ఏ అడవిలోనో బాగు పడగలడా? సమాజం గురించి సంక్షిప్తంగా పరిచయం చేసే ప్రయత్నమే ఈ చిరు పుస్తకం.