
SAMAJANIKI BAHIRANGA LEKHA
by MANCHIKANTI
₹50
In stock · 9 available
PublisherMANCHIKANTI
LanguageTelugu
నా మాట మామూలు ఉపాధ్యాయుడుగా నా జీవితం ప్రారంభమైంది. తెలిసీ తెలియని బోధనతో మొదలై ప్రభుత్వం ఏటేటా ఉపాధ్యాయ శిక్షణ నిర్వహించేటప్పుడు శిక్షణలో కొత్త కొత్త విషయాలు నేర్చుకుని సీనియర్ టీచర్లు నుండి మంచి విషయాలు గ్రహించి కొద్దికొద్దిగా బోధన మెళకువలు నేర్చుకుంటూ మరోవైపు కవిత్వం కథలు రాసుకుంటూ ముందుకు సాగుతున్న జీవితం పుస్తక అధ్యయన విస్తృతి వలన ఎన్నో మలుపులు తిరిగింది. నిజమైన బోధన ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదో కొద్దికొద్దిగా అర్థమవుతూ ఉండేవి. బోధనలో ఏది మంచి ఏది చెడు అనే విషయాలలో గొడవ పడుతూ ఉండే వాడిని. కొన్ని శిక్షణా తరగతుల్లో నేను శిక్షణనిచ్చే ఉపాధ్యాయుడిగా ఉండేవాడిని. మా అబ్బాయి ఐదు దాటి ఆరు తరగతులకు వచ్చేసరికి నిజమైన విద్యకు అర్థం ఏమిటో తెలిసింది. వెంటనే మా బాబును విజయవాడ పోరంకిలోని వికాస విద్యావనంలో చేర్పించాను. అంతటితో మావాడి విద్య గురించిన బెంగ మటు మాయమైందని భావించాను. ఇక నా బోధన గురించిన బెంగ అలాగే ఉండిపోయింది. కవితల నుంచి కథల్లోకి కథల నుంచి నవలల్లోకి వ్యాసాల్లోకి ఎదుగుతూ వచ్చిన నాకు పాఠశాలలో బోధన విషయంలో ఎంతో అసంతృప్తి ఉండేది. ఆ సమయంలో మానవ హక్కుల విద్య గురించిన వర్క్షాప్లో పాల్గొనడం, మాడ్యూల్ రచనలో పాల్గొనడంతో ఇక నా ఉపాధ్యాయ బోధన ఎలా ఉండాలో పాఠశాలల్లో పిల్లల హక్కులను ఎలా కాపాడాలో తెలిసి వచ్చింది.