
SAMAJIKA RAJAKEEYA PARINAMALU DRUSHTI KONALU (CIVILS GROUP I )
₹199
In stock · 45 available
PublisherBARSA PUBLICATIONS
LanguageTelugu
ISBN9788199390119
Samajika Rajakeeya Parinamalu Drushti Konalu Dr. Mohammad Hasena పుస్తకంలోని అన్ని వ్యాసాలు ప్రాసంగికత కలిగినవే. అయితే 'రాజ్యాంగం ఎదుర్కుంటున్న సవాళ్లు' అనే వ్యాసం రాజకీయంగా మరింత ప్రాసంగికత సంతరించుకున్నది. నయా ఫాసిస్టు పాలనలో రాజ్యాంగ విలువలను కాలరాస్తూ పెడధోరణులకు పాదులు వేస్తూ పోతున్న ప్రస్తుత తరుణంలో అది మరింత ప్రాసంగికత కలిగిందని చెప్పవచ్చు. 'రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కానట్లయితే అది చెడు ఫలితాలను ఇస్తుంది. ఎంత చెడ్డ రాజ్యాంగమైనా దాన్ని అమలు చేసేవాళ్లు మంచివాళ్లయితే అది మంచి ఫలితాలను ఇస్తుంది" అని డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారు. ఆ వ్యాసం చదువుతున్నప్పుడు ఆ మాటలు గుర్తుకు వచ్చాయి. మన రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో కూడా రాజ్యాంగాన్ని ఆశించిన స్థాయిలో అమలు చేయలేదు. "మార్పు అన్ని రంగాల్లో ఆశించిన స్థాయిలో రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా క్షేత్రస్థాయిలో అమలు జరగలేదనేది బహిరంగ రహస్యమే" అని చెప్పే విషయంలో హసేన నీళ్లు నమలలేదు. గుడి కన్నా బడి ప్రధానమైందని, ప్రతి ఒక్కరికీ మరణం తప్పదని రచయిత 'బడి.. గుడి.. స్మశానం' అనే వ్యాసంలో వివరించారు. ఒక తాత్విక నేపథ్యంలో రాసిన వ్యాసం ఇది. ఈ వ్యాసాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన అవసరం నేటి పరిస్థితుల్లో వుంది. రచయితకు సామాజిక పరిణతి, సానుకూల జీవన తాత్వికత వున్నాయి. అందుకే “ఎంత పరిపక్వత వుంటే మనిషి మృత్యువును సంతోషంగా ఆహ్వానించగలడు? అంతటి పరిపక్వత వున్న వ్యక్తి స్థితప్రజ్ఞుడే అవుతాడు. చావు వస్తున్నట్లు ముందే తెలిస్తే తప్పించుకుని తిరగడా మరి. బడికి వెళ్లడానికి ఇష్టపడకపోయినా, గుడికి వెళ్లడానికి ఇష్టపడకపోయినా మృత్యువును తప్పించుకోలేం కదా!" అని అనగలిగారు. ఇలా ఒకటేమిటి అన్ని వ్యాసాలు పాఠకులను ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా ఇవి సివిల్స్, గ్రూప్-1 లాంటి పరీక్షలు రాసే అభ్యర్థులకు చక్కని సమాచారాన్ని ఇస్తాయి. -కాసుల ప్రతాపరెడ్డి ISBN 978-81-993901-1-9 బర్స్ పబ్లికేషన్స్