
SAMETHA KATHALU
₹100
In stock · 140 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
సామెత కథలు మోదుగుల రవికృష్ణ “ఒక పిండితార్థాన్ని కొద్ది మాటల్లో చెబుతుంది సామెత.” ఒక విషయాన్ని స్పష్టంగా, సూటిగా వ్యక్తం చెయ్యటానికి ఉపకరించేది సామెత. సామెతలలో మానవజీవిత ఛాయలుంటాయి. పెద్దలు తమ అనుభవాన్ని పిల్లలకు హితోపదేశంగా చెప్పిన నీతులే సామెతలుగా నిల్చివున్నాయి. ఇవి మనిషి నడవడికకు మార్గాలుగా వుంటాయి. మాట్లాడేటప్పుడు ఒక సామెతను ప్రయోగిస్తే అది ప్రసంగానికి వన్నె తెస్తుంది. ఈ సామెతలలో దేశీయ వృత్తులు, నాగరికతలు, నమ్మకాలు, ఆచరణలు, అనుభవాలు, వ్యవహారాలు, చరిత్రలు, శాస్త్రాలు మొదలగు విషయాలు తేటతెల్లమౌతాయి. అంతేకాదు పసిడి తునకలవంటి పదజాలంతో భాష విరాజిల్లుతుంది. తెలుగు భాషకు వన్నె తెచ్చిన అమూల్యమైన లోకోక్తులు మన ఉపేక్ష వల్ల కనుమరుగయ్యే దుస్థితి దాపురించింది. ఈ పుస్తకంలో కొన్ని సామెతలను కథల రూపంలో పిల్లలకు ఆసక్తి కలిగించే విధంగా ໖. ఈ కథలు సామెతల యొక్క విశిష్టతను పిల్లలు తెలుసుకోవటానికి దోహదపడతాయని ఆశిస్తున్నాం.