
SAMMARDHAM
₹60
In stock · 177 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సమున్నత ఆశయానికి సంక్లిష్ట పోరాటం “ఆంధ్ర జిల్లాల్లో పార్టీ సభ్యులు 1936 నాటికి వందకు మించి యుండరు. కాని, యించుమించు అందరూ స్వాతంత్య్ర సమరంలో కాకలుతీరిన యోధులు; పలుమార్లు లాఠీ దెబ్బలుతిన్నవారు; జైళ్లలో “దేవతా పులుసు” అన్నం తిన్నవారు; కాళ్లకు బేడీలు వేయించుకున్నవారు; నిరాహార వ్రతాల్లో బలవంతంగా పోసే పాలను బయటికి కక్కేసినవారు; సొంత ఆస్తులులేని వారు; ఉన్నా వాటిమీద మమకారం లేనివారు; కుటుంబంకన్నా పార్టీని మిన్నగా పరిగణించినవారు; తోటి కామ్రేడ్స్న ఆదుకున్నవారు; అన్యాయమెక్కడ జరిగితే అక్కడ ప్రత్యక్షమవుతుండినవారు; దౌర్జన్యమెక్కడ జరిగితే అక్కడ దుముకుతుండినవారు; వారి మాటలకు, చేతలకు పొంతన ఉండేది; సిద్ధాంతానికి, ఆచరణకూ సంబంధం వుండేది; ఈ లక్షణాలే వారిని కష్టకాలంలో కాపాడేవి;” దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి పునాదులు వేసిన అగ్రగణ్యుల్లో కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణగారు (సీనియర్) ఒకరు. స్వాతంత్య్ర సమరయోధుడైన సీనియర్ గారు రాసిన “ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర - మొదటి భాగంలోని తొలిపలుకుల నుండి ప్రఖ్యాతి వహించిన, అనుభవ పూర్వకమైన ఈ మాటలను ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త, వినమ్ర పూర్వకంగా గ్రహించాలి. తొలితరం కమ్యూనిస్టుల అకుంఠిత దేశభక్తి, త్యాగనిరతి, సేవాతత్పరత, వెనుకడుగెయ్యని సంకల్ప బలం, మొక్కవోని ధైర్యసాహసాలు, దీక్షాతత్పరత ప్రస్తుతరం కమ్యూనిస్టులకు శిరోధార్యం. ఆ మహనీయులు అందించిన విలువలు, ఆచరించిన నైతిక ప్రమాణాలు ప్రస్తుత కమ్యూనిస్టులందరకూ స్ఫూర్తిదాయకం. ఆస్ఫూర్తితోనే మన మహాసభలలో నిర్ణయాలుచేసి వీటి అమలుకు అహర్నిశలూ పాటుపడటానికి దీక్షాకంకణులు కావాలి. సమాజంలోని అసమానతలకుగల కారణాలను వివరించ గల్గిన మార్గాలకోసం చిరకాలంగా అనేకమంది అన్వేషించారు. కొందరు పుట్టుక నుండి చనిపోయేవరకు ఎంత శ్రమించినా ఆకలితో అలమటించిపోతూ, అవమానాలతో కృంగిపోతూ వుంటే మరికొంత మంది వీసమెత్తుకూడా పనిచేయకుండా భోగభాగ్యాలతో తులతూ గుతూ వుండటానికి గల కారణాలేమిటో బోధపడక ప్రజలు సత మతమవుతూ ఉండేవారు. ఇప్పటికీ కొంతమందికి ఈ 'చిదంబర రహస్యం' అర్థంగాక, చెట్టునో, పుట్టనో, దేవుణ్ణి, దెయ్యాన్నో నమ్ముకొని బతుకు ఈడుస్తున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులు చరిత్రగమనాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. అనేక సూత్రాలను ప్రతిపాదించారు. ఆదర్శప్రాయమైన సమాజాల గురించి అనేక వర్ణనలు చేశారు. మార్క్స్ మహాశయుడన్నట్లు "తత్వవేత్తలు ప్రపంచానికి పలు