SAMPUTI 1 GERMAN BHAVAJALAM by Y.V.RAMANARAO Telugu book cover

SAMPUTI 1 GERMAN BHAVAJALAM

by Y.V.RAMANARAO

₹130
In stock · 21 available
PublisherY.V.RAMANARAO
LanguageTelugu
ముందుమాట మార్క్స్, ఎంగెల్స్ లు “ జర్మన్ భావజాలం” గ్రంథాన్ని 1845-47 మధ్య రచించారు. వారి భౌతికవాద దృక్పథాల్ని స్పష్టపరచుకోడానికే దీన్ని రాశామని చెప్పుకున్న వారు, ఆ తర్వాత దీని రాతప్రతిని ఎలుకలకు ఫలహారంగా వదిలేశామనీ అన్నారు. ఈ రాతప్రతిని మార్క్స్ తదనంతరం చూసిన ఎంగెల్స్ దాన్ని సరిదిద్దినా, ప్రచురించలేకపోయాడు. దీనిలో కొన్ని పేజీలు దొరకలేదు, కొన్ని చినిగాయి, రంగు మారాయి, కొన్ని పేజీల్లో అక్షరాలు అధ్వాన్నంగా ఉన్నాయి. అటువంటి దీన్నుండి 1964 లో మొదటి ఆంగ్ల ప్రతిని ప్రోగ్రెస్ పబ్లిషర్స్, మాస్కో వారు ప్రచురించారు. జర్మన్ భావజాలం ”(ఇకపై, "జ॥ భా|| ”) గ్రంథం రెండు సంపుటాల్లో ఉంటుంది. రెండవ సంపుటంలో " నిజమైన సోషలిస్టులు "పై వుంటుంది. మొదటి సంపుటంలో మూడు అధ్యాయాలు ఉంటాయి. I. ఫోయర్బాక్, II. బ్రూనో బాయెర్, III. మాక్స్ స్టిర్నర్ లపై విమర్శ ఉంటుంది. ఈ తెలుగు ప్రతిలో మాత్రం మొదటి సంపుటిలోని అధ్యాయం-I ఐన " ఫోయర్బాక్” మాత్రమే ఉంటుంది. ఈ గ్రంథంతో సంధానించబడి రాసినట్లుగా అన్పించేదైన మార్క్స్ రచన “ ఫోయర్బాక్పై సూత్రీకరణలు" యొక్క మూల ప్రతినీ, ఎంగెల్స్ సరిదిద్దిన ప్రతి (ఇది నిడమర్తి ఉమారాజేశ్వరరావు చేసిన అనువాదం--" మార్క్స్, ఎంగెల్స్ సంకలిత రచనలు, భాగం-I, ప్రగతి ప్రచురణలు, మాస్కో " -- నుండి యధాతథంగా ఈ తెలుగు ప్రతిలో ఇవ్వబడింది) కాక, " ఫోయర్బాక్పై ఎంగెల్స్ ” పేర గల నోట్స్ను (ఇది “ జర్మన్ భావజాలం " గ్రంథం కొరకు ఎంగెల్స్ తయారుచేసిన నోట్స్ కూడా కలిపి మూడు అనుబంధాలుగా ఈ తెలుగు ప్రతికి జతచేశాం. మొత్తం ఆంగ్లంలో 50 సంపుటాల్లో గల " మార్క్స్, ఎంగెల్స్ సంకలిత రచనలు, సంపుటి-V " నుండి ఈ తెలుగు ప్రతి అనువదించబడింది. ఫోయర్బాక్, బ్రూనో బాయెర్, మాక్స్ స్టిర్నర్ లపై, భావజాలంపై మొత్తం 4 సంక్షిప్త పరిచయాలు 'తెలుగు అనువాదకుని వివరణలు' (వి1-వి4)పేర ఇవ్వబడ్డాయి. ఆనాటి(1840ల్లో) ప్రముఖ భావవాద తత్వశాస్త్ర ధోరణుల ప్రతినిధులైన లుడ్విగ్ ఫోయర్బాక్°1, బ్రూనో బాయెర్”, మాక్స్ స్టిర్నర్”లు చరిత్ర చోదక-శక్తులుగా ప్రాచుర్యం కల్పించిన ‘ అమూర్త మానవుడు/జీవ-జాతి '(ఫోయర్బాక్ చే), ‘ విమర్శ/స్వీయ-చైతన్యం ’(బ్రూనో బాయెర్ చే), ‘ అహం/ఒకే ఒక్కటి '(మాక్స్ స్టిర్నర్ చే) అనే భావాలను మార్క్స్, ఎంగెల్లు వాస్తవ చరిత్రలోని భౌతికపర అంశాల ఆధారాలతో నిర్దాక్షిణ్యంగా, వ్యంగ్యాత్మకంగా విమర్శిస్తారు.