
SAMSKRUTHA SUKTI RANTNAKARAMU
₹200
In stock · 20 available
PublisherR.ANANTHA LAKSHMI
LanguageTelugu
ప్రస్తావన సూక్తి (సు+ఉక్తి) అంటే సుభాషితం. మంచి మాట అన్న మాట. మంచిమాటకు ఎంతవిలువా, శక్తీ ఉంటాయో చెప్పలేం. సూక్తులు ప్రధానంగా నీతిని బోధిస్తాయి. ఉన్నారణములైన వారికి సన్మార్గాన్ని ఉపదేశించి వారి జీవితాలకొక దీప్తిని కలిగిస్తాయి. చెడుమార్గంలో నడుస్తున్న ఒక వ్యక్తి ఎదుట అతని దుష్ప్రవర్తనను గూర్చి ఒక సూక్తిని మనం వినిపిస్తే అతడు తన ప్రవర్తనకు లోలోన ఎంతో సిగ్గుపడతాడు. పశ్చాత్తాపపడతాడు. సన్మార్గంలో నడవడానికి కొంతైనా ప్రయత్నిస్తాడు. ఎంతో లోకానుభవాన్ని పండించుకొని విజ్ఞులు చెప్పినవి సూక్తులు. తన జీవితమంతా అనుభించిన ఒక సత్యాన్ని అనుభవజ్ఞుడు ఒక చిన్న సూక్తితో ప్రకటింపజేస్తున్నాడు. అంటే ఒక చిన్న సూక్తిలో ఒక వ్యక్తి జీవితానుభవమంతా నిండి ఉన్నదన్న మాట. ఆ దృష్టితో చూస్తే సూక్తులకెంత ప్రాధాన్యముందో అవగతమౌతుంది. కనుకనే కవులు విశ్వశ్రేయః ప్రధానాలైన తమ కావ్యాలలో సందర్భానుగుణంగా ఎన్నెన్నో సూక్తిరత్నాలను పొదివి మనకు అందించినారు. ఈ సూక్తులు మానవుని జీవితంలోని అన్ని కోణాలకూ సంబంధించిన అతని జీవితస్థాయిని సంస్కరించుకొని సమున్నతం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. సంస్కృత సాహిత్యాన్ని పరిశీలిస్తే అందులో మన కీ సూక్తిసాహిత్యం అపారంగా కనిపిస్తుంది. మానవజీవితం ధర్మబద్ధంగానూ, నీతిబద్ధంగానూ ఉండాలన్న ఆకాంక్ష ప్రాచీన కవులకెంత గాఢంగా ఉండేదో అవగతమౌతుంది. తెల్లవారి లేచింది మొదలు నిద్రపోయే వరకు వివిధదశల్లో మానవుని వర్తనం ఎలా ఉంటే సమాజానికి హితకారిగా ఉంటుందన్న విషయాన్ని ఈ సూక్తులు వివరిస్తాయి. వ్యక్తి సంస్కారం ద్వారా సమాజ సంస్కారానికి ఈ సూక్తి సాహిత్యం ఎంతగానో దోహదంచేస్తుంది. సంస్కృతంలో కేవలం మతానికి సంబంధించిన అంశాలే ఉన్నాయికాని సామాజిక స్పృహగల అంశాలు లేవని ఆధునికులు కొందరి అభిప్రాయం. సంస్కృత సాహిత్యంలోని కొన్ని సూక్తులను పరిశీలిస్తే ఈ మాటలో ఎంత సత్యముందో మనకర్ధమౌతుంది. తన కడుపు నింపుకోవడానికి సరిపోయేంత ధనంపైనే వ్యక్తికి అధికారంకాని అంతకన్నా ఎక్కువగా ఎవడు ధనాన్ని కోరుకుంటాడో వాడు దొంగ, వాణ్ని శిక్షించాలి. అని వ్యాసుడు ఈ కింది శ్లోకంలో వివరిస్తున్నాడు.