SAMSKRUTHANDHRA PADAKOSAMU by NAVARATNA BOOK HOUSE Telugu book cover

SAMSKRUTHANDHRA PADAKOSAMU

by NAVARATNA BOOK HOUSE

₹500
In stock · 5 available
PublisherNAVARATNA BOOK HOUSE
LanguageTelugu
ISBN9789387824317
సంస్కృతాంధ్ర పదకోశము ఆముఖం 'కోశవాన్ ఆచార్యః' అంటే నిఘంటువుల్ని పూర్తిగా చదివి మననం చేసుకువాడే ఆచార్యుడు అని ఆర్యోర్తి. అదే తెలుగులో దేశాన్నైనా చూడు, కోశాన్నైనా చూడు" అన్న నానుడిగా ఖ్యాతి పొందింది. నిఘంటువుల పరిజ్ఞానం వల్ల విద్యార్థులకు అపరిమితమైన భాషాజ్ఞానం కలుగుతుంది. సాధారణంగా శబ్దాలకు అర్ధాలను తెలిపే గ్రంథాన్ని నిఘంటువు అంటారు. దీనినే అనుశాసనం, కోశం, అభిదానం అని కూడా అంటారు. మన తెలుగు భాషలో ఇప్పటిదాకా ఎన్నో నిఘంటువులు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటిలో, ఆంధ్రదీపిక, శబ్దరత్నాకరం, శబ్దార్థ చంద్రిక, శబ్దార్ధ చింతామణి, శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు వంటివి. తెలుగుభాషకు సంబంధించిన ఎన్నోవేల పదాలకు అర్ధాలను తెలియచేసే ప్రామాణిక నిఘంటువులుగా బహుళ జనాదరణ పొందాయి. ఇక సంస్కృత నిఘంటువుల విషయానికి వస్తే అమరసింహుడు 'నామలింగానుశాసనం' అనే పేరుతో రచించిన అమరకోశం ప్రముఖమైనదిగా కనిపిస్తుంది. సంస్కృత భాషా పరిజ్ఞానాన్ని ఇది ఎంతగానో పెంపొందిస్తుంది. కనుకనే సంస్కృతం నేర్చుకునే ప్రతి విద్యార్థిచేతా ఇందులోని కాండలన్నిటినీ బట్టీయం వేయించేవారు. అమరకోశం తరువాత శబ్దకల్పదృమం, వాచస్పత్యం, అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఈ నిఘంటువులన్నీ సంస్కృతభాషలోనే సంస్కృతపదాలకు అర్థాల్ని తెలియజేస్తాయి. ఇదిలావుండగా ఆంగ్లేయులు మనదేశానికి వచ్చి, మన సంస్కృతభాష ప్రాముఖ్యాన్ని గుర్తించి, ఈ భాషను ఎంతో శ్రద్ధగా అధ్యయనం చేసారు. వీరిలో హెచ్.ఎస్. విల్సన్ సంస్కృత- ఇంగ్లీషు నిఘంటువుని రూపొందించగా, ఎమ్. విలియం ఇంగ్లీష్-సంస్కృత నిఘంటువుని రూపొందించాడు. ఆ తరువాత సంస్కృత శబ్దాలకు తెలుగు అర్ధాలను తెలియచేస్తూ 1875 లో శ్రీ పరవస్తు శ్రీనివాసాచార్యులుగారు "సర్వశబ్ద సమ్భోధిన్యాఖ్యోయమ్ సంస్కృతాంధ్ర నిఘంటుః" అనే పేరుతో ఒక నిఘంటువుని ప్రామాణికంగా రచించారు. వీరి తరువాత 1961 లో 'శబ్దార్ధ కల్పతరువు' అనే పేరుతో శ్రీ మామిడి వేంకటాచార్యులవారు కూడా ప్రామాణికమైన సంస్కృతాంధ్ర నిఘంటువుని మనకందించారు.