SAMSKRUTHI SAMSKARAM by GUJJU VENKATREDDY Telugu book cover

SAMSKRUTHI SAMSKARAM

by GUJJU VENKATREDDY

₹80
In stock · 79 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400651
SAMSKRUTHI SAMSKARAM by Gujju Venkata Reddy 1942 క్విట్అండియా ఉద్యమ సంవత్సరాన జన్మించి, నేడు ఎనభైవ ఏట పడిన గుజ్జు వెంకటరెడ్డి స్థిరనివాసం గూడెం గ్రామం, టెక్కలి మండలం. శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి మాష్టారుగా గుర్తింపు ఉన్న వీరు ప్రస్తుతం టెక్కలి సాహితీ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షునిగా, టెక్కలి మేధావుల ఫోరం అధ్యక్షునిగా ఉన్నారు. సామాజిక పత్రికలకు రాసిన ఎన్నో వ్యాసాలకు అదనంగా 2015లో ప్రచురితం అయిన “భావ ప్రభంజనాలు” వీరి మొదటి పుస్తకరచన కాగా "సంస్కృతి-సంస్కారం” రెండవ రచన. ప్రపంచీకరణ, ఆధునికతలో కొట్టుకుపోతున్న మానవ జీవితంలో జీవితాన్ని సంస్కరించుకోవడానికి, ఉన్నతీకరించుకోవడానికి, సార్థకత కల్గించుకోవడానికి అవసరమైన జీవనసూత్రాలు, సూక్తులు, సుద్దుల మందారమాలే ఈ 'సంస్కృతి సంస్కారం”. భారతీయ పురాణాలు, వేదాలు, బుద్ధుడి నుండి అనేకమంది తాత్త్వికుల వరకు నేటి సమాజం తప్పక నేర్చుకుని మార్చుకోవలసిన, స్వీకరించాల్సిన సంస్కృతి సంస్కారం ఇక్కడ మెండుగా ఉంది. వైధవ్య స్త్రీలపట్ల, స్త్రీ పురుష సంబంధాల పట్ల, స్త్రీల హక్కుల పట్ల లోక కల్యాణానికి ఆచరణ సాధ్యమైన ఆధునికమైన ఆలోచనలు మేళవింపే ఈ “సంస్కృతి సంస్కారం". ఉపాధ్యాయ విద్యకు, వృత్తికి భావిభారత పౌరులను ఎలా తయారుచేయాలో శాస్త్రీయంగా చేసిన సూచనే ఈ “సంస్కృతి సంస్కారం.” విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-91400-65-1