SANATHANA DHARMA SAMHITHA by KANDUKURI VENKATA GOVINDESWARASARMA Telugu book cover

SANATHANA DHARMA SAMHITHA

by KANDUKURI VENKATA GOVINDESWARASARMA

₹200
In stock · 10 available
PublisherKANDUKURI VENKATA SATYABRAHMACHARYA
LanguageTelugu
ప్రపంచ సృష్టికర్త అయిన విశ్వకర్మ పరమేశ్వరుని వామదేవ ముఖం నుంచి పుట్టినవాడు సనాతన బ్రహ్మర్షి. ఆయన దేవతల కోసం చెప్పినదే ఈ సనాతన ధర్మ సంహిత. ఇందులో ఆయన బ్రహ్మస్వరూపాన్ని నిర్ణయించి చెప్పాడు. బ్రహ్మమును ఉపాసించే క్రమమును తెలిపాడు. ఈ బ్రహ్మాండం ఎలా ఉత్పత్తి అయిందో... దీనిలోని బ్రహ్మచర్యాది వర్ణాశ్రమాల వారు పాటించాల్సిన ధర్మాలేమిటో వింగడించాడు. సదాచారాన్ని పాటించాల్సిన పద్ధతి, పాపకర్మ విచార ఫలం, మోక్షధర్మం వంటి ఎన్నో విశేషాంశాలను తెలియచేస్తూ... శిల్పశాస్త్ర మహిమ, వాస్తుపురుష మాహాత్యాలను సైతం ఆయన ఇందులో వెల్లడించాడు. బ్రహ్మశ్రీ జుజ్జూరి వెంకటరత్నాచార్యులు దీనికి 1913లో తాత్పర్య దీపికను అందించారు. బ్రహ్మశ్రీ కందుకూరి వేంకట గోవిందేశ్వరశర్మ ప్రాచీనప్రతిని సంపాదించారు. వారి కుమారుడు కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య మళ్లీ ఇన్నేళ్లకు శ్రీ కామాక్షీదేవి పూజాపీఠమ్ పక్షాన ఈ పుస్తకాన్ని ప్రచురించి లోకార్పణం చేస్తున్నారు. ఇతి పరమరహస్యం వేదవేదాంతసారమ్ | కథిత మమలరూపం మోక్షసామ్రాజ్యహేతుమ్