
SANCHARI BURRAKATHA EERAMMA
₹80
In stock · 17 available
PublisherCHAAYA RESOURCES CENTRE
LanguageTelugu
ISBN9788194736387
నివేదన అమ్మనుడి మాసపత్రికలో నేను అనువదించిన 'ఓ సంచారి అంతరంగం', 'మౌనంలోని మాటలు', 'సంచారి బుర్రకథ ఈరమ్మ' 'జోగిని మంజమ్మ ఆత్మకథ'-వరుసగా ప్రచురింపబడ్డాయి. ఇవన్నీ సంచారుల బతుకు కతలే. 'సంచారి బుర్రకథ ఈరమ్మ' పుస్తకాన్ని మిత్రులు ఆర్.బి.కుమార్ నాకు పంపారు. కన్నడలో ఈ పొత్తాన్ని డా. నింగప్ప ముదేనూరు రాశారు. మూడు తరాలకు పూర్వం ఆంధ్ర నుంచి కర్ణాటకకు వలస పోయిన ఓ సంచార కుటుంబానికి చెందిన వ్యక్తి ఈరమ్మ. తల్లిదండ్రుల నుంచి అబ్బిన బుర్రకథ కళను చిన్నప్పటి నుంచే ప్రదర్శిస్తూ 'బుర్రకథ ఈరమ్మ'గా ప్రపంచానికి పరిచయమైంది. 'బుర్రకథ' చెప్పటమే ఆమెకు బతుకు తెరువు అయింది. ఈరమ్మ వ్యక్తిగత జీవితం పూలపాన్పు కాదు. ఆమె తన జీవితంలోని కష్టసుఖాలు, భర్త హింస, సవితి పోరు, ఆడదాని బతుకులోని నిజమైన బాధలను మనసు విప్పి చెప్పుకుంది. అయితే ఈరమ్మ నిరక్షరాస్యురాలు కావటం వల్ల డా. నింగప్ప ముదేనూరుగారు ఆమె బతుకు కతను మన ముందుకు తెచ్చారు. ఈరమ్మ గొప్ప గాయకురాలు, అద్భుతమైన సృజనాత్మక శక్తి దేవుడు ఆమెకు ఇచ్చిన వరం. నిరక్షరాస్యురాలైన ఈరమ్మ సుమారు 7000 పుటల, లక్ష పంక్తులు కలిగిన 11 జానపద మౌఖిక మహాకావ్యాల కర్త అంటే బహుశా ఎవరూ నమ్మరేమో! అయితే నమ్మాలి. ఆమె గానం చేస్తున్న కావ్యాలలో కొన్నింటిని కన్నడ విశ్వవిద్యాలయం (హంపి) వారు ప్రచురించడం జరిగింది.