SANGEETHA MERU SIKHARALU by JANUMADDI HANUMACCHASTRI Telugu book cover

SANGEETHA MERU SIKHARALU

by JANUMADDI HANUMACCHASTRI

₹70
In stock · 573 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
శ్యామశాస్త్రి 1762-1827 ఆత్మోన్నతికి చేసే సాధనలో సంగీతం కూడా ఒకటి. భక్తి యోగంలో సంగీతానికి ప్రథమ స్థాన మిచ్చినవారిలో శ్యామశాస్త్రిగారు ఒకరు. శ్రీ త్యాగరాజు, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్త్రి కర్ణాటక సంగీత త్రిమూర్తులుగ సుప్రసిద్ధులు. వీరిలో శ్యామశాస్త్రి పెద్దవారు. శ్యామశాస్త్రి 2.4.1762 తేదీన తమిళనాడులోని తిరువారూర్లో జన్మించారు. తండ్రి విశ్వనాథ అయ్యర్, తల్లి వెంగలక్ష్మి, తమ శిశువుకు వెంకట సుబ్రహ్మణ్యం అని నామకరణం చేశారు. కానీ గారాబంతో శ్యామ అని పిలిచేవారు. ప్రసిద్ధులైనది శ్యామశాస్త్రిగానే. తమ 18 ఏటనే, తల్లిదండ్రులతో తంజావూరు చేరారు. అక్కడ బంగారు కామాక్షి దేవాలయంలో అర్చకులుగావున్న తండ్రికి తోడ్పడుతుండేవాడు. క్రమంగా కామాక్షి దేవికి అనన్య భక్తులైనారు. తండ్రి తర్వాత శ్యామశాస్త్రి గారే అర్చకులయ్యారు. ఇంటిలో కంచి కామాక్షిని పూజించేవారు. శ్రీచక్రోపాసన చేసేవారు. దేవీ ఉపాసకులైన శ్యామశాస్త్రిగారు, పలుమార్లు దేవిని ప్రార్థిస్తూ దైవీ భావంలో లీనమై బాహ్య స్మృతిని కోల్పోయేవారు. బాల్యంలోనే సంస్కృతం, తెలుగు భాషలలో అపార పాండిత్యం గడించారు. శ్యామశాస్త్రి గారి తండ్రి తాతలకు సంగీతాసక్తి వుండేదికాదు. శ్యామశాస్త్రి గారు సంగీతజ్ఞులు కావటానికి, వారి కంఠ మాధుర్యం, ఆసక్తి, ప్రతిభలతోపాటు పూర్వ జన్మ సంస్కారంతో పాటు దేవి అనుగ్రహం కారణం కావచ్చు. 'ప్రపేదిరే ప్రాక్తన జన్మవిద్యా' అన్న కాళిదాసు మాటలకు నిదర్శనం శాస్త్రిగారు. శాస్త్రిగారి 18 ఏట మేనమామ సంగీతంలోని మెళకువలు నేర్పారు. చాతుర్మాస్య దీక్ష చేపట్టిన 'సంగీత స్వామి' అన్న సన్యాసి, యువకుడైన శ్యామశాస్త్రి గారికి అరుదైన సంగీతగ్రంథములిచ్చి ఆశీర్వదించారు. ఆనాటి ఆస్థాన సంగీత విద్వాంసులు, పచ్చి మిరియం ఆదియప్పను కలుసుకోమని సూచించారు. అంతేకాక, త్యాగరాజ, ముత్తుస్వామి దీక్షితుల సహవాస ఫలితంగా శాస్త్రిగారి సంగీత జ్ఞానం పెంపొందుటకు సహకరించాయి. సంగీత మేరు శిఖరాలు