SANKELLA SAVVADI by MALUPU BOOKS Telugu book cover

SANKELLA SAVVADI

by MALUPU BOOKS

₹150
In stock · 2 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076015
sankella savvadi ప్రజాస్వామిక హక్కుల కార్యకర్త అరుణ్ ఫరేరాను మే 2007లో నక్సలైట్ అన్న ఆరోపణతో నాగపూర్ పోలీసులు రైల్వేస్టేషన్లో అరెస్టు చేశారు. ఆ తరువాత కొద్ది మాసాల్లో ఇతరులతో కలిపి ఆయనపై మరెన్నో నేరాలను మోపారు. నేరపూరిత కుట్ర, హత్య, అక్రమ ఆయుధాలు, దొమ్మీ మొదలైన నేరాలను ఆయనకు ఆపాదించారు. మహారాష్ట్రలో అత్యంత కుఖ్యాతి చెందిన నాగపూర్ సెంట్రల్ జైల్లో ఆయనను బంధించారు. దాదాపు ఐదేళ్ల ఫరేరా జైలు జీవిత అనుభవాల సారమే ఈ పుస్తకం. ఖైదీగా ఆయన పడ్డ చిత్రహింస, దెబ్బలు, అవినీతి వ్యవస్థ, తోటి ఖైదీల ప్రవర్తనా తీరు, క్రౌర్యానికి వ్యతిరేకంగా ఖైదీల్లో పెల్లుబికిన నిరసన, నిస్సహాయ స్థితితో కూడిన సాధారణ వాతావరణం, ఆశను సజీవంగా వుంచిన చిన్న చిన్న ఓదార్పులు మొదలైనవాటన్నింటి గురించీ ఆయన నిశితంగా, నిర్మొహమాటంగా అభివర్ణించడం మనం చూస్తాం. సెప్టెంబర్ 2011లో ఫరేరా అన్ని ఆరోపణల నుంచీ విముక్తుడయ్యారు. కానీ, జైలు గేటు బయట తెల్లదుస్తులు ధరించిన పోలీసులు అరెస్టు చేయడంతో ఆయనకు స్వేచ్ఛ మళ్లీ అందకుండా పోయింది. అప్పుడు తన కోసం కొద్ది దూరంలో వేచివున్న కుటుంబ సభ్యులను క్షణమైనా చూడలేకపోయారు. చివరకు సాహసవంతులైన స్నేహితులు, కార్యకర్తల సహాయంతో తనను జైల్లో పెట్టేందుకు చేసిన ఆరోపణలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆయన విజయం సాదించారు. ఊచల వెనుక అసలేం జరుగుతోందో చెప్పే వాస్తవిక గాథ ఈ “సంకెళ్ల సవ్వడి” (Colours of the Cage). పాఠకులకు బాగా తెలిసిన సెల్యులాయిడ్ చిత్రం వంటిదో లేక నవల వంటిదో కాదిది. అలా అని కేవలం దుర్భర జైలు జీవితం గురించిన వివరణా కాదు. ఒక వ్యక్తి న్యాయం కోసం పట్టుదలగా చేసిన పోరాటపు, మానవ సంకల్పం సాధించిన విజయపు అద్భుత స్వీయగాథ.