SANKELLANU THENCHUKUNTU by DR. RAHUL A. SHASTRI Telugu book cover

SANKELLANU THENCHUKUNTU

by DR. RAHUL A. SHASTRI

₹300
In stock · 1 available
PublisherBHOOMI BOOK TRUST
LanguageTelugu
1939లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పెదమద్దాలి గ్రామంలో జన్మించిన కె. మాధవరావు గ్రామపాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. మచిలీపట్నం హిందూ కాలేజీలో డిగ్రీ చదివారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బీ.ఏ. (ఆనర్స్) పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయవాద డిగ్రీ పూర్తి చేశారు. 1962లో ఆయన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసు (ఐఏఎస్)లో చేరి, ప్రభుత్వ అధికారిగా విశిష్ట సేవలందించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. మాధవరావుకు పీడిత మానవాళి పట్ల ఎడతెగని శ్రద్ధ, అభిమానం మరియు అణచివేతకు గురయ్యే అట్టడుగు, నిస్సహాయ, పీడితవర్గాల సంక్షేమం పట్ల లోతైన అంకితభావం ఉన్నాయి. మానవీయ ప్రపంచ దృక్పథంతో కూడిన క్రియాశీలమైన, బహుముఖీన వ్యక్తిత్వం ఆయనది. తన జీవన పోరాటం నుంచి, అనుభవాల నుంచి ఆయన తన భావాలకు పదునుపెట్టుకున్నారు. సామాజిక శక్తులు వాటి పరస్పర సంబంధాలపై ఆయనకు సన్నిహిత, విశ్లేషణాత్మక అవగాహన ఉన్నది. ఒక అధికారిగా, వ్యక్తిగా ఆయన సహాయం కోరిన నిస్సహాయ ప్రజలకు ఆయన కొండంత అండగా నిలిచారు. సమానత్వంపై, మానవ గౌరవంపై సంపూర్ణ విశ్వాసం కలిగిన మాధవరావులో సామాజిక న్యాయం పట్ల చెక్కుచెదరని అంకితభావం, న్యాయమైన సమస్యల కోసం పోరాడే ధైర్యం, తెగువ నిండుగా ఉన్నాయి.) ఎస్.ఆర్.శంకరన్ విశ్రాంత ఐ.ఏ.ఎస్ అధికారి