SANKHYA SASTRAM - 30 by N R GOPAL SARMA Telugu book cover

SANKHYA SASTRAM - 30

by N R GOPAL SARMA

₹30
In stock · 9 available
PublisherSRI BALAJI PUBLICATIONS
LanguageTelugu
ముందు మాట రాజు అయినా - పరవాడు అయినా తన భవిష్యత్తు ఎలా ఉంటుందో. తెలుసు కోవాలని అనుకొంటాడు. అయితే ఈ సంఖ్యాశాస్త్రము, సాముద్రిక శాస్త్రం మన రాబోయే భవిష్యత్తు తెలుసుకోవటానికి మనకు మంచి దారి చూపించటానికి ఉపయోగపడుతున్నాయి. మనిషికి రెండు నేత్రములు ఎలాంటినో, ఈ సంఖ్యా శాస్త్రము, సాముద్రిక శాస్త్రము మన భవిష్యత్తు తెలుసుకోవటానికి నేత్రముల లాంటివి. దీపం మనకు దారిని ఎలా చూపిస్తుందో శాస్త్రములు కూడా మంచి సలహాలను మంచి మార్గంను సూచిస్తాయి. ఎన్ని శాస్త్రములన్నా అవి అన్నియూ మనకు ఉపయోగపడటానికే! ఏ శాస్త్రములు అయినా మనకు రాబోయే భవిష్యత్తు, మన కష్టసుఖముల గురించి సూచించే శాస్త్రములే! భవిష్యత్తు గురించి తెలుసుకోవటానికి చేయు ప్రయత్నములే! జ్యోతిషశాస్త్రం - 27. నక్షత్రములు- 12. రాశుల గణితం పై ఆధారపడిన శాస్త్రం. సంఖ్యాశాస్త్రం 9. సంఖ్యల పై ఆధారపడిన శాస్త్రం. హస్తసాముద్రిక శాస్త్రం - చేతి రేఖల ఆధారంగా భవిష్యత్తు చెప్పేశాస్త్రం. ప్రతీ మనిషికి ఏదో ఒక సంఖ్య ప్రభావం అతని జీవితం పై ఉంటుంది. ఎక్కువ కావచ్చును. తక్కువకావచ్చును. అయితే ఈ సంఖ్యా శాస్త్రం ఆధారంగా సంఖ్యయొక్క ప్రభావం వల్ల ఆ వ్యక్తికి జరగబోయే విషయముల గురించి - కష్టసుఖముల గురించి తెలుసుకోవటానికి ఉపయోగప తున్నది- అతనికి మంచి మార్గమును, సూచిస్తుంది - ఆ వ్యక్తి ఏ దారిలో ప్రయాణం చేస్తే లాభపడతాడో తెల్పుతుంది. తెలుసుకోవటం వల్ల లాభం ఉంటుంది. వెలుతురులో రాయి విసిరిన దానికి -చీకటిలో రాయి విసిరిన దానికి తేడా ఉంటుంది కదా! కాబట్టి శాస్త్రం తెలుసుకోవడం వల్ల లాభం ఉంటుంది.