SANTHI DOOTHA NAYAKURALU by Y.H.K.MOHANA RAO Telugu book cover

SANTHI DOOTHA NAYAKURALU

by Y.H.K.MOHANA RAO

₹100
In stock · 27 available
PublisherY.H.K.MOHANA RAO
LanguageTelugu
శాంతిదూత నాయకురాలు శాంతి దూత నాయకురాలు 6 వర్తమాన కాలంలోనైతే నాయకురాలిని నోబెల్ బహుమతితో సత్కరించేవారు. ఒక గొప్ప శాంతి దూతగా ప్రపంచం కొనియాడేది. సమర భూమికి చేరిన తరువాత గుడారాల ముందు విడిది చేసిన యుద్ధాన్ని దాటుకుంటూ సంధిచేసుకోవడం స్వల్పవిషయమేమీకాదు కదా!. ఒర నుండి తొంగిచూస్తున్న ఖడ్గాలను నిలువరించి యుద్ధాన్ని ఆపి, హింసా రక్తపాతాలకు స్వస్తి పలకడానికి మార్గం వేసింది నాయకురాలి విశాల ఆలోచన. అందుకే నేను ఆమెను శాంతి దూత అని ప్రస్తుతిస్తాను. బాలచంద్రుని ఆగడాల మూలంగా, బ్రహ్మనాయుడి యుద్ధోన్మాదం బుసలుకొట్టడంతో విచ్ఛిన్నమైన సంధి ఒప్పందం ఎంత రక్తపాతానికి దారితీసిందో రుధిర చరిత్ర మనకు వివరిస్తూనేవుంది. ఆ విచ్ఛిన్నంతో ఎన్ని ప్రాణాలు పోయాయో, ఎందరి ఆడపడుచుల మాంగల్యం మంట గలిసిందో యుద్ధానంతరం లెక్కలు తేలడం మనం చూశాము. కనీస కుటుంబ వారసత్వం లేకుండా అంతరించిన వంశాలు మనకు కనిపిస్తూనే వున్నాయి. అలా జరుగకుండా వుండేందుకే ముందుచూపుతో, మమతల మాతృత్వంతో భవిష్యత్ను దర్శించిన నాయకురాలు నలగామరాజుని ఒప్పించి కోటకేతు మహారాజు బృందాన్ని సంధి రాయబారానికి పంపింది. సంధి ప్రక్రియలో భాగంగా బ్రహ్మనాయుడి వర్గీయుల గొంతెమ్మ కోర్కెలన్నింటికీ అంగీకారం తెలిపింది. కోడి పోరులో కోల్పోయిన రాజ్యాన్ని యిస్తామని, వలస కాలం ముగిసి గడచిన ఏడు నెలలకు కప్పం చెల్లిస్తామని. నరసింగరాజుని అప్పగిస్తామని ప్రత్యర్థుల అన్ని కోర్కెలను మన్నించిన నాయకురాలిని శాంతి దూత అని కీర్తించడం సబబుకాదా? మీరేమంటారు?. అయితే రణభూమికి చేరిన తరువాత నాయకురాలు సంధి రాయబారం పంపడం ఒక రాజకీయ ఎత్తుగడ అని ఒకరిద్దరు రచయితలు పేర్కొన్నారు. నాయకురాలు రాయబారం పంపితే ఎత్తుగడ. అంతకు క్రితం రెండు పర్యాయాలు బ్రహ్మనాయుడు రాయబారం పంపితే అదేమో ఎనలేని చిత్తశుద్ది!. ఎందుకిం వివక్ష?. ఇందులోని నిజాలు పరిశీలన చేస్తే ఎవరిలో చిత్తశుద్ది ఉందో మనం అర్ధం చేసుకోగలం.