SAPEKSHA SIDDANTHAM ANTE YEMITI by D.V.N.SARMA Telugu book cover

SAPEKSHA SIDDANTHAM ANTE YEMITI

by D.V.N.SARMA

₹30
In stock · 409 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మనకు అనుభవంలో ఉన్న సాపేక్షత ప్రతి వాక్యానికీ అర్థం ఉంటుందా? ఉండద నేది స్పష్టమే. మనం కొన్ని మాటలను తీసుకొని వ్యాకరణ నియమాలను తూ.చా. తప్పకుండా పాటిస్తూ వాటిని జోడించినప్పటికీ చివరకు అది అర్ధంపర్ధంలేనిదిగా తయారుకావచ్చు. ఉదాహరణకు “నీరు త్రిభుజాకారం" అనే వాక్యంలో ఏ విధమైన అర్ధమూ లేదు. అయితే అర్ధంపర్ధంలేనిదంతా ఇంత స్పష్టంగా ఉండదు. మొట్టమొదటిసారి చూచినప్పుడు చాలా సబబుగా కనిపించే వాక్యం లోతుగా పరీక్షించిన మీదట పూర్తిగా అర్ధం లేనిదిగా మారిపోవడం చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. కుడా లేక ఎడమా? ఇల్లు వీధికి కుడివైపునా, ఎడమవైపునా ఏ వైపున ఉంది? ఈ ప్రశ్నకు నువ్వు ఉన్నఫళంగా సమాధానం చెప్పలేవు.