
SARADA KAVITHABHIVARDHINI
₹100
In stock · 10 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
శారద కవితాభివర్ధిని శ్రీమతి శారదా అశోక్ వర్ధన్ కవితా పరామర్శ ప్రముఖ అభ్యుదయ కవి, కీర్తిప్రకాశకులు డా|| ఆవంత్స సోమసుందర్గారు మరో సీనియర్ కవయిత్రి, రచయిత్రి గురించి రాసిన చిన్న పొత్తం ఇది. చిన్నదే కానీ విషయం చాలా పెద్దది. 'ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు' అన్న వాక్యం తెలుగుజాతి నోటికెక్కిన మహాకవి సోమసుందర్ గారు. అన్నింటినీ మించి సహృదయ శేఖరుడు ఆయన. దాని ఫలితమే కవయిత్రి అయిన తన జూనియర్ శారదగారి గురించి, సాహిత్యావలోఢనం చేసిన మంచిమనిషి సోమసుందర్ గారు. ఇది శారదగారి కవిత్వ గ్రంథాలకు దర్పణంలాంటిది. అయితే కవిత్వ గ్రంథాలలో కూడా పదిదాకా వారి పరిశీలనకు నోచుకున్నాయి. డా|| ఎన్. గోపీ కవి, విమర్శకులు సోమసుందర్ శ్రీమతి శారదా అశోకవర్ధన్గారి కవితాహృదయం గ్రహించి వారి ఆరు కవిత్వసంపుటాలపై సమాలోచన చేయడం నిజంగా 'శారద కవితాభివర్ధిని'కి గొప్ప ఉపాయనం. 'శారదా కవితాభివర్థిని' అనే ఈ గ్రంథం శ్రీమతి శారదా అశోకవర్ధన్గారి కవితాహృదయం ఆవిష్కరిస్తూ స్వయంగా ఆయన తలపెట్టి రాయడం శారదగారి భాగధేయం. శారదగారి కవితలపై సోమసుందర్గారి విశ్లేషణ ప్రత్యంశ కూలంకషంగా సాగింది. మంచిచెడులను సమానంగా ఎత్తిచూపుతూ సుకవిత్వపథ నిర్దేశనం చేశారు. భావనా నైశిత్యమూ, మాటల పొదుపరితనమూ, అనవద్య సౌందర్యమూ అనే త్రిగుణాలను ధరించి నిరంతర కవితాసాధనతో. శారదగారిని సాగిపొమ్మని తొలుతనే ఆశీర్వదించిన సోమసుందర్ గారు. సుధామ