
SARADA RACHANALU - 1
by SARADA
₹325
In stock · 195 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఎక్కడి పుదుక్కోటై, మరెక్కడి తెనాలి? ఆ తమిళనాడు నుంచి ఈ తెలుగునాటకు పదమూడేళ్ల కుర్రాడు తరలివచ్చాడు. అతనికదే మహాప్రస్థానం. తెనాలిలో అడుగు పెట్టిందే తడవుగా హోటల్ వర్కర్ ప్రవేశించాడు. రోజుకి పద్దెనిమిది గంటలు ఎత్తిన నడుం వంచకుండా పనిచెయ్యాలి. చేశాడు. అది మాత్రమే చేయలేదు. పరభాష అయినప్పటికీ తెలుగుభాషను నేర్చుకోసాగాడు. *** తెలుగు నేర్చాడు. రాయాలనుకున్నాడు. మొదలు పెట్టాడు. జీవితం చాలా అనుభవాలను ఇచ్చింది. అదే అతని రచనకు ఆలంబన. తనకు తానే ప్రయత్నించి, ఒకరిద్దరు, తెలుగు మిత్రుల్ని కలుపుకొని "ప్రజావాణి” పేరుతో రాత పత్రికను ప్రారంభించాడు. ఈ సాధన, తపస్సు, అతనికి తెలుగు సాహిత్యపు రూపాల్ని ఆకళింపు చేసుకోడానికి ఎంతో తోడ్పడింది. ఆకలి, దారిద్య్రం, చీకట్లో బ్రతుకు, కన్నీళ్లు ఇవే అతని కలం నుంచి వేయిముఖాలతో రూపొందాయి. ఇంతలో అతనికి నిండైన అవకాశం ఒకటి వచ్చింది. 'ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం' పెదపూడిలో సాహిత్య పాఠశాలను నిర్వహించింది. అందులో చేరాడు యస్.నటరాజన్. ఆ నెల రోజులు గొప్ప ఆత్మీయతనీ, వెలుగునీ సంపాదించాడు. అది అతనికే చాతవును. *** దోసెలు పోసే గరిటెతోపాటు కలం పట్టిన నటరాజన్-ఆనాటి భుజంగరావు, ప్రకాశం వంటి మిత్రుల సాహచర్యంలో నేరుగా కమ్యూనిజంలోకి ప్రవేశించాడు. అభ్యుదయ రచయితల సంఘంలో ఆయనకు ఎంతటి ప్రముఖ స్థానం లభించిందో తెలియదుగానీ, అభ్యుదయ సాహిత్యంలో మాత్రం ఆయన నవలలు 'మంచి-చెడూ' 'అపస్వరాలు' ; కథలు 'రక్తస్పర్శ' లాంటి రచనలు శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్నాయి.