
SARIKOTHA VEKUVA
₹100
In stock · 41 available
PublisherVALLABOJU JYOTHI (J.V.PUBLICATIONS)
LanguageTelugu
సరికొత్త వేకువ (కథలు) కోసూరి ఉమాభారతి రచనలు చేసేవారి వ్యక్తిత్వం వారి రచనల్లో ప్రతిబింబిస్తుందంటారు. కోసూరి ఉమాభారతిగారి కథలు చదువుతూ ఉంటే ఇది నూటికి నూరుపాళ్లు నిజమని మనకు తెలిసిపోతుంది. ఆమె ఉదాత్తమైన, భావాలు, సమున్నతమైన వ్యక్తిత్వం, సమాజసేవ పట్ల ఆమెకున్న ఆసక్తి, కళలపట్ల ఆమెకున్న ఎనలేని అనురక్తి, ఎన్ని సవాళ్లు ఎదురైనా జీవితాన్ని సానుకూల దృక్పధం నుంచి నడిపే శక్తి అన్నీ ఈ కథాసంపుటిలోని అక్షరాల్లో ప్రతిబింబిస్తాయి. అమెరికా తెలుగు సాహిత్య వేదిక - భావరాజు పద్మిని రచయిత్రి తీసుకున్న కథాంశాలన్నీ మన చుట్టూ జరుగుతున్న సంఘటనల ఆధారంగా రాసినవే. కొన్ని పాత్రల ఆవేదన, మనోభావ ప్రకటన, పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేసిన చిత్రణ చూస్తుంటే రచయిత్రి సరదాగా కాకమ్మ కథలు చెప్పే వ్యక్తి కాదనీ, ఎంతో సీరియస్ రచయిత్రి అనిపిస్తుంది. మనిషికీ, మనిషికీ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను చూపించటం రచయిత్రి ఒక బాధ్యతగా తీసుకున్నారనిపిస్తుంది. – మందపాటి సత్యం