SARPAALU SARPADASTULU by K.SURYA KUMARI Telugu book cover

SARPAALU SARPADASTULU

by K.SURYA KUMARI

₹50
In stock · 326 available
PublisherK.SURYA KUMARI
LanguageTelugu
తొలిపలుకు ఆచార్య డాక్టరు కేతు విశ్వనాథరెడ్డి "అవసరమైన చూపున్న కథలు" ఒక కథల సంపుటిని చదివాక, కనీసం మనకు మూడు అనుభవాలు కలగాలి. మొదటి అనుభవం జీవితానికి సంబంధించింది. మనకింత వరకూ, అంతగానో, పూర్తిగానో తెలియని జీవిత పార్శ్వాల్ని కథల్లో చదివి మన జీవితానుభవ విస్తృతికి తోడ్పడగలదనుకునే అనుభవం. రెండో అనుభవం మన వాల్లో కలిగే చలనానికి సంబంధించింది. మూడోది భావనం, చలనం తర్వాత మనల్ని కదిపే, కుదిపే కథల్లోని ఆధునిక సంస్కార దృష్టికి చెందింది. కథా రచయితలో లేదా కథా రచయిత్రిలో ఎంత చిత్త శుద్ధితో కూడిన జీవిత విశ్వసనీయ చిత్రణ ఉంటే అంత నిశితంగా, ఎంత రచనా నైపుణ్యముంటే అంత వారంగా అనుభవాల్ని పొందగలుగుతాము. సూర్యముఖిగారి సంపుటిలోని ఏడు కథలూ చదివాక, ఈ మూడు అనుభవాలు కలుగుతాయా? అనే ప్రశ్న సహజంగానే తలెత్తాలి. ఈ కథల్లో చిత్రించిన జీవితం కథలు చదివాకే పూర్తిగా ఎరుకలోకి వస్తుంది. ఈ కథల్లోని సమస్యలు మనకు తెలిసినవే, పూర్తిగా తెలిసినవి మాత్రం కాదు. ఈ కథల్లోని పాత్రలు మనం చూచినట్లు, మనకు పరిచయం ఉన్న వాళ్లు కావచ్చు. పూర్తిగా తెలిసిన వాళ్లు మాత్రం కాదు. సన్నివేశాలూ, సంఘటనలూ, నేపథ్యము, వీటి విషయంలోనూ అంతే. ఈ కథల్లోని పాతతరం స్త్రీలు, తల్లులూ, అత్తలూ, అమ్మలూ మనల్ని ఆలోచింపచేస్తారు. ఎందుకు వీళ్లింకా తమ వికృత ప్రకృతుల్లోనే కొట్టుకుంటున్నారు? ఈ కథల్లోని కొత్తతరం యువకుల్లో కొంతమంది మనల్ని భయపెడతారు. విద్యాగంధమున్నా, అమెరికా వాసమున్నా స్త్రీలపట్ల వీళ్ళవైఖరి