
SASIREKHA - CHALAM SAHITYAM NAVALALU
₹180
In stock · 18 available
PublisherAMARAVATHI PUBLICATIONS
LanguageTelugu
చలం “తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలం ది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణానుభూతాంతరాలను రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు విస్తృతంగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, మేలుకొలిపే ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కన్నుమూశారు. ✦ ✦ ✦ శశిరేఖ చలం మొదటి నవల. 1921లో రాశారు. తల్లిదండ్రుల శిశుపాలనకర శ్రద్ధ, గుడ్డిగు రామమూర్తి పంతులు వంటి పెద్దలు ఈ నవలను ప్రశంసించారు. చలం బ్రహ్మ సమాజ ప్రభావం నుండి బయట పడుతున్న రోజులలో ఈ నవల రాశారు. స్త్రీ స్వేచ్ఛకు ఉద్యమించిన బ్రహ్మ సమాజం, వివాహానికి ప్రేమకన్నా సంబంధం ఎక్కువదని అంటుంది. చలం నాయక “శశిరేఖ” ప్రేమనే వివాహాన్ని అంగీకరించింది. ఈ ఆదర్శాల సంఘర్షణే ఈ నవలను నడిపిస్తుంది. ప్రేమకు సమాజనీతికి మధ్య జీవితాన్ని ప్రయోగానికి పెట్టుకున్న నవల నాయక “శశిరేఖ”.