
SATHAKALU - KANDA PADYAMALIKA
₹150
In stock · 437 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400262
SATHAKAALU (Kanda Padya Malika) By Illa Muralidhara Rao మాతృ దేవోభవః, పితృ దేవోభవః, అతిథి దేవోభవః అని ప్రారంభించి, విద్యల గురించి, మూఢనమ్మకాల గురించి, 'అన్న' ఎన్టీయార్ గురించి మొత్తంగా ఆరు శతకాలు తేలాయి. ఈ 'శతక సంపుటి' అమ్మానాన్నల నిరుపమాన త్యాగాన్నీ, బాంధవ్యాల ఆవశ్యకతనూ తెలియజేస్తుంది. గుండె తలుపు తట్టి, సూటిగా పిల్లల బాధ్యతను గుర్తు చేస్తుంది. పెద్దల యెడ గౌరవాన్నీ, అతిథి మర్యాదనూ స్పృశిస్తుంది. అతిథుల బాధ్యతనూ సూచిస్తుంది. విద్య యొక్క ఆవశ్యకతను వివరిస్తుంది. యువసమాజాన్ని, సహేతుకత వైపు నడిపించి, మూఢనమ్మకాలను కదిలించి, భావితరాలకూ పఠనయోగ్యమయింది. 'వెండితెర వేలుపు అనిపించుకున్న ఎన్టీయార్ శతజయంతి సందర్భంగా రాయబడిన శతకం కూడా ఇందులో చోటు చేసుకోవడంతో సినిమా ప్రియులకూ ఈ పుస్తకం నచ్చుతుంది. విజ్ఞులైన పాఠకుల దీవెనలు, సూచనలు, సలహాలను ఆశిస్తూ..... పాఠక దేవుళ్ళకు నమస్సులతో ఇళ్ళ మురళీధరరావు ISBN 978-93-91400-26-2 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004