SATHAVASANTHALA COMMUNIST UDHYAMAM (1920 - 2020) by GADDAM KOTESWARA RAO Telugu book cover

SATHAVASANTHALA COMMUNIST UDHYAMAM (1920 - 2020)

by GADDAM KOTESWARA RAO

₹120
In stock · 336 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
బ్రిటీషు పాలన ద్వంద్వనీతిని, దోపిడీని కమ్యూనిస్టు పార్టీ తన శక్తిమేర జనానికి చేరవేసింది. మత కల్లోలాలకు, దేశ విభజనకు మతోన్మాదులు రెచ్చిపోవడానికి బ్రిటీషు పాలకులే కారణమని కమ్యూనిస్టు పార్టీ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. మహోజ్వల స్వాతంత్య్ర పోరాటంలో, కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ, అశేష త్యాగాలతో, దీక్షా దక్షతలతో కమ్యూనిస్టు పార్టీ జాతీయోద్యమంలో పాల్గొంది. దేశ విముక్తికి తనవంతు కర్తవ్యాన్ని నెరవేర్చింది. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, నిరంకుశ స్వదేశీ సంస్థానాల దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడి నేలకొరిగిన వేలాదిమంది కమ్యూనిస్టులు సదా స్మరణీయులు. ఆస్తులు పోగొట్టుకుని, జీవితాల్ని, కుటుంబాలను పణంగా పెట్టి, తీవ్రంగా నష్టపోయిన పార్టీ కుటుంబాలు వేలకొలదే ఉన్నాయి. అలాంటి త్యాగధనుల కుటుంబాలు కమ్యూనిస్టు ఉద్యమానికి నిరంతరాయ స్ఫూర్తిప్రదాతలుగా ఉంటాయి.