
SATHYA - ARNADH
by ARNAAD
₹150
In stock · 74 available
PublisherNAVODAYA BOOK HOUSE
LanguageTelugu
సత్య అర్నాద్ ఇదొక సెన్సేషనల్ నవల. నాలుగేళ్ల క్రితం వారం వారం స్వాతి వీక్లీలో సంచలనం సృష్టించి అశేష పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న ఒక అద్భుతమైన సీరియల్ నవల సత్య. బహుమతి గెల్చుకుంది. కథా, నవలా రచయితగా సుప్రసిద్ధులైన అర్నాద్ అందించిన నాల్గవ నవల ఇది. సత్య ఒక పల్లెటూరి పిల్ల. ఒక అపరిచితుడిని పెళ్లి చేసుకుని ఏవేవో పసిడి కలలతో, ఎన్నెన్నో మధురోహలతో కాపురానికొస్తుంది. పెళ్లి చేసుకున్నవాడు పెళ్లాన్ని అనుమానించే మూర్ఖుడు. ఒక విలక్షణమైన శాడిస్టు. ప్రతి రాత్రి ఆమెకు నరకం చూపిస్తాడు. అతి దారుణంగా, . కిరాతకంగా హింసిస్తాడు. భర్త హింస నుంచి బయటపడి తన బతుకేదో బతుకుదామనుకుంటే ఆమెను బతకనీయకుండా హింసిస్తుంది ఆమె చుట్టూ ఉన్న సమాజం. పరిస్థితులు సత్యను ఓ రెబల్ ఉమెన్గా మారుస్తాయి. డొంకతిరుగుడు లేకుండా సూటిగా, బలంగా, అర్ధవంతమైన మానసిక విశ్లేషణతో హృదయానికి హత్తుకుపోయేలా. చెప్పగల కథనం ఈ నవల్లో కనిపిస్తుంది. అలరించి ఆలోచింపజేస్తుంది. కవనశర్మగారన్నట్టు అర్నాద్ చాలా నిశితంగా విషయాలను పరిశీలించి, విశ్లేషించి సమగ్రంగా అర్ధంచేసుకుని పాఠకునికి అర్ధమయ్యేల నవలారూపం ఇవ్వగల అతి కొద్దిమంది నవలా రచయితల్లో ఒకరు. డా. కె. బాలకృష్ణ