
SATHYA SODHANA - MOHANDAS KARAMCHAND GANDHI
₹150
In stock · 1 available
PublisherANDHRA PRADESH GANDHI SMARAKA NIDHI
LanguageTelugu
ఈ పుస్తకం : 'ఎవరి కోసం! ఎందుకోసం' మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ 1869వ సంవత్సరంలో ఒక సామాన్య, సాంప్రదాయ హిందూ వైష్ణవ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. అతి సాధారణమైన స్కూలు విద్యా దశలోనే 13వ ఏట వివాహం చేశారు. పెద్దల ప్రోద్బలంతో ఇంగ్లండ్ వెళ్ళి బారిష్టరు చదివారు. తిరిగి వచ్చిన తరువాత బొంబాయి హైకోర్టులో మొదలిడిన ప్రాక్టీసు అంతగా ఫలించలేదు. ఆ తరుణంలో 1893వ సం॥లో దక్షిణాఫ్రికాలోని ఒక ముస్లిం కంపెనీకి లాయరుగా ఆహ్వానం అందడం, తక్షణం ప్రయాణం చేసి అక్కడ దిగిన దగ్గర నుండి కొత్త కొత్త అనుభవాలు, అనుభూతులు ఎదురయ్యాయి. మొదటి వారంలోనే ఎదురైన హోర అవమానం నడుస్తున్న రైలులో నుండి మొదటి తరగతి భోగీలో కూర్చున్న గాంధీని ఆంగ్లేయ తెల్లదొరలు బయటికి నెట్టి వేయడం ఆయనను కలచివేసింది. తక్షణమే జాతి వివక్షతను ఎదిరించడానికి నిర్ణయించుకొన్నారు. తన అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఎప్పటికప్పుడు అసాధారణ నిర్ణయాలు తీసుకుంటూ; మానవ, వృత్తి ధర్మాలను, నియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ తెల్లదొరలను ఎదుర్కొన్నారు. 1894లో భారత దేశానికి తిరుగు ప్రయాణ సన్నాహాలు చేస్తుండగా, దక్షిణాఫ్రికాలోని నాటాల్, ట్రాన్స్వోల్ ప్రాంతాలలోని భారతీయుల దయనీయ పరిస్థితి, అదే సమయంలో నాటాల్ శాసన సభ ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టడం దాని ప్రకారం, ఎంతో కాలంగా అక్కడ నివశిస్తున్న భారతీయుల ఓటు హక్కును రద్దు చేయడం ఆయనను ఎంతో కలతపరిచింది. అక్కడి భారతీయ సంతతివారు ప్రయాణాన్ని వాయిదా వేయమని కోరడంతో వారికి అండగా వుండాలని నిర్ణయించారు. 'నాటాల్ ఇండియా కాంగ్రెస్' అనే రాజకీయ సమూహాన్ని స్థాపించి దాని ద్వారా ఆ విచక్షణాపూరితమైన శాసనాన్ని ఎదిరించి, చాలా వరకు విజయం సాధించారు. దానితో తెల్లవారి దొరతనాన్ని ఎదిరిస్తూ నిలబడడానికి కావలసిన శక్తి, ప్రతిభ, ఆత్మస్థైర్యం, నిర్భయత్వం అలవడ్డాయి. వాటితో పాటు సత్యం, అహింస, మానవ ధర్మ నియమ నిబంధనలను పాటిస్తూనే బ్రిటిష్ వారి సామ్రాజ్య విస్తరణ కాంక్షను ఎదిరించడానికి దృఢ నిశ్చయం చేసుకున్నారు.