
SATYAGNI KATHALU
₹120
In stock · 56 available
PublisherFATHIMA PUBLICATIONS
LanguageTelugu
నామాట నేను మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యుల వారి శిష్యున్ని, చిన్నప్పటి నుండీ సంప్రదాయ సాహిత్యం అంటే మక్కువ. 1980 కంటే ముందు రాసినవన్నీ పద్యాలు, ముత్యాలసరాలు చందస్సులో గేయాలు. కాలేజిచదివే రోజుల్లో 'భగ్నవీణ' గేయ కావ్యం రాసినాను. రాజకీయాల కంటే ముందు నేను కార్మిక నాయకున్ని. తొలుత విద్యార్థి దశలో కమ్యూనిస్టు పార్టీలోనూ ఆ తర్వాత కాంగ్రెస్లోనూ పనిచేశాను. సంఘటిత, అసంఘటిత కార్మికుల దైనందిన జీవితాలను అత్యంత సన్నిహితంగా చూచాను. వాళ్ళతో కలిసి మెలిసి తిరిగాను. చావకుండా బతకడానికి కావాల్సిన తిండికోసం వాళ్ళు చేసే బతుకు పోరాటాలూ, అడపాదడపా వారి పట్ల డబ్బున్న వాళ్ళు సాగించే దురాగతాలు... ఇవే నా కెదురయ్యే రోజువారీ సమస్యలు. స్వతహాగా సాహిత్యం పట్ల ఉన్న అభిమానం కొద్దీ, వీటన్నిటికీ అక్షర రూపం ఇవ్వాలంటే కథ తప్ప మరొక బలమైన సాహిత్య సాధనం లేదని అభిప్రాయ పడ్డాను. అప్పటి వరకూ నేను చదివిన లబ్ధప్రతిష్టులైన కథారచయితలు కొడవగంటి, రాచకొండ, రాచమల్లు ఇత్యాది రచయితల కథలు నామీద గాఢంగా ముద్రవేశాయి. అయితే ఎవరి శైలినీ అనుకరించకుండా నాదంటూ ఒక శైలిని ఎంచుకోవా లనుకున్నాను. పీడకులు, పీడితులు- ఇద్దరూ చదవడానికి అనువైన సాహిత్య ప్రక్రియ కథ. కాబట్టి నా అనుభవాలను, నాకు ఎడురైన విభిన్న పాత్రలను కథల్లో పెట్టాలని నిర్ణయంచు కున్నాను. ఇప్పటి వరకూ నేను రాసిన కథలన్నీ సమాజంలో నేను చూచిన, నాకు తెలిసిన యదార్థ జీవన చిత్రాలే. 1987లో సాహితీ మిత్రుడు శశిశ్రీతో కలిసి మిత్రసాహితి పేరుతో సాహితీ సంస్థను ఏర్పరచి, తరచూ సభలూ, సమావేశాలూ ఏర్పాటు చేసేవాళ్ళం. ఇదికూడా నాలో ఉన్న కథాభిలాషను ద్విగుణీకృతం చేసింది. 1988 జూన్లో 'అగ్నిసరస్సు' పేర కథా సంకలనాన్ని ఆవిష్కరించాను.