
SAYEADA X - O APARACHITHA BHARATEEYURALI KATHA
by RAMASUNDHARI
₹390
In stock · 3 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076534
జరీ చీర భారతదేశానికి స్వాతంత్ర్యం రాగానే బెంగాలీ సాలెలు చాలామంది కనీసం ఒక మువ్వన్నెల చీరనైనా నేసారు. అప్పటికి రషీదకు ఏడేళ్లు. అందరూ అబ్బాజీ అని పిలిచే రషీద్ తండ్రి మహమ్మద్ కాస్బే ఒకరోజు దుర్గ పూజకోసం చీరను తయారు చేస్తున్నాడు. స్వతంత్ర భారతదేశపు కొత్తజండాలో మూడు రంగులు వున్నాయి. 'మనం సాయిబ్బులం కదా. హిందూ దేవత చీరనెందుకు నేస్తున్నాం?' అబ్బాజీని అడిగాడు రషీద్. 'చీరకు హిందూ, ముస్లిం మతంలేదు' అబ్బాజీ రషీద్కు చెప్పాడు. 'ఏటా జరిగే హిందూ పండగకు చీరను తయారుచేయటం బెంగాలీ ముస్లిం నేతవాళ్ల సాంప్రదాయం.' 'బెనారస్ హిందూ నగరమా?” రషీద్ అబ్బాజీని అడిగాడు. 'తెల్లోళ్లు పిలవటం మొదలు పెట్టాకనే ఈ గోలంతా. అసలు బెనారస్ అంటే మసాల్దాన్. అంటే మసాలపెట్టె' చెప్పాడు అబ్బాజీ. ప్రపంచంలోనే పురాతనమైన నగరం బెనారస్ అని కొంతమంది అంటారు. ఈ నగరానికి చాలా గుర్తింపులు ఉన్నాయి. ఇక్కడ చనిపోతే మోక్షం లభిస్తుందని నమ్మే హిందువులది బెనారస్ అని రషీద్క చెప్పాడు అబ్బాజీ. అయితే ఇక్కడి జనాభాలో నాలుగోవంతు వున్న ముస్లిములది కూడా ఈ పట్టణం. ఈ బెనారస్ మత సంకీర్ణాన్ని ప్రోత్సహించటమే కాకుండా, తాను స్వయంగా నేతవాడైన సూఫీ సాధువు కబీర్హీ, అణచివేత గుణం వున్న హిందూ కులదొంతరను సవాలు చేసిన సాధువు రవిదాసీ కూడా. గురుగ్రంథ్ సాహెబ్ అనే పవిత్ర మతగ్రంథాన్ని అనుసరించే సిక్కులది కూడా ఈ బెనారస్. ఆ గ్రంథంలో కబీర్, రవిదాస్ల బోధనలు వుంటాయి. 1506లో ఈ నగరాన్ని సందర్శించిన సిక్కుల మతగురువు గురునానక్ ఈ బోధనలను సేకరించాడు. ఈ నగరం బౌద్ధులది కూడా.