
SCHOOL VIDYARTHULAKU COMPUTER
by Sudha Murty
₹30
In stock · 222 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
కంప్యూటర్ అంటే? శతాబ్దాల క్రితంనాటి మానవుడు శిలతో అంటే బండరాళ్ళతో ఆయుధాలను తయారు చేస్తూండేవాడు. వాటి సహాయంతోనే జంతువులను వేటాడేవాడు. దీన్నే శిలాయుగం అంటారు. మరి కొంతకాలానికి లోహాన్ని కనిపెట్టాడు. కొడవఠి, కత్తి, బాణం లాంటి ఆయుధాలు లోహంతో చేశాడు. దీన్ని లోహయుగం అని పిలిచేవారు. ఈవిధంగా మానవుడు నిరంతర పరిశోధనలు చేస్తూ -సుఖ జీవనాన్ని మరింత సులభంగా వెళ్ళదీయాలన్న ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ దిశలో అతడు కొత్తకొత్త ఔషధాలను కనిపెట్టాడు. ఆకాశంలో పక్షిలా ఎగరాలన్న కోరికకు అనుగుణంగా విమానం కనుగొన్నాడు. నీళ్ళలో చేపలా ఈదాలన్న ఉద్దేశంతో సబ్మెరీన్ కనిపెట్టాడు. ఈ విధంగా విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇంకా ఇంకా అడుగు ముందుకు వేసి అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. అటువంటి వాటిలో గణాంక యంత్రం అంటే కంప్యూటర్ ని కనిపెట్టడం కూడా ఒకటి. ఇప్పుడు మీరు వెళ్ళుతున్న ప్రతిచోట కంప్యూటర్ కనిపిస్తుంది. ఇదిప్పుడు సర్వసామాన్యమైపోయింది. మీరు బస్సులోనో, రైలులోనో ఊరికి వెళ్ళుతున్నారా? సరే! బస్ స్టాండు కౌంటర్ లో టికెట్ అడిగితే కంప్యూటర్ ద్వారానే అది బైటకు వస్తుంది. ఆ టికెట్మీద మీ టూర్కు సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి. ప్రయాణం చేసే తారీఖు, బస్ నెంబరు, సీట్ నెంబరు, బయలుదేరే సమయం తదితర వివరాలన్నీ అందంగా అచ్చె ఉంటుంది. మీరు విమానంలో ప్రయాణం చేయాలనుకొంటున్నారా?