
SCIENCE KU DESAMLO GADDU KALAM
₹100
In stock · 342 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126276
ప్రతి శాస్త్రవేత్తా ఒక మానవవాది. అతను జ్ఞాన సముపార్జనతో కొత్తదారులు వెతుకుతాడు. కొత్త అన్వేషణలకు ద్వారాలు తెరుస్తాడు. తను చేసిన ప్రయోగాలకు ఫలితాలు సాధిస్తాడు. ఫలితాలు విజయవంతమైతే మళ్ళీ అవి మానవాళికి ఉపయోగకరంగా ఉన్నాయా? అని పరీక్షించుకుంటూ ఉంటాడు. సంతృప్తి చెందితేనే తన కృషి ఫలితాన్ని మానవాళికి ధారపోస్తాడు. ప్రతి శాస్త్రవేత్తా చేసేపని ఇదే! వీరు ప్రతి విషయానికీ రుజువులూ, నిరూపణలూ కావాలంటారు. ఇది ఇలా ఉంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని గొప్పగా బతకనిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, దేశంలో సైన్సును, సైంటిఫిక్ టెంపరు పనిగట్టుకుని నాశనం చేస్తోంది. ఒకవైపు వైజ్ఞానిక పరిశోధనా సంస్థలకు నిధులివ్వకుండా ఆపేసింది. మరోవైపు వందల సంఖ్యలో ఉన్న సైన్సు అవార్డుల్ని రద్దు చేసింది. అసలు దేశంలో 'ప్రశ్న' బతికి ఉండకూడదన్నది వారి విధానమైనట్లు చర్యలు చేపడుతూ ఉంది. వీటికన్నా మరో ప్రమాదకరమైన చర్య ఏమిటంటే, పాఠ్యాంశాల్లో విషాన్ని నింపి - రాబోయే తరాల భవిష్యత్తును చీకటిమయం చేయడానికి పూనుకుంది. అందువల్ల సైన్సుకు దేశంలో గడ్డుకాలం అనే ఈ పుస్తకం ఈ అంశాలన్నింటినీ చర్చించింది. నేటి దేశ కాల పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని- ప్రొఫెసర్ దేవరాజు మహారాజుగారు చేసిన ఈ విశ్లేషణలు జన చైతన్యానికి తప్పక దోహదం చేస్తాయి! జననాడిని, జీవనాడిని పట్టుకోవడంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ఎప్పుడూ ముందే ఉంటూ వస్తోంది గనక, ఈ పుస్తకాన్ని కూడా పాఠకులకు సగర్వంగా అందిస్తూ వుంది.