SCIENCE LO SARADALU - 90.00 by DR.MAHIDHARA NALINI MOHAN Telugu book cover

SCIENCE LO SARADALU - 90.00

by DR.MAHIDHARA NALINI MOHAN

₹90
In stock · 803 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
SCIENCE LO SARADALU మహీధర నళినీ మోహన్ స్వాతంత్ర్యోద్యమ సమరంలో ముగ్గురు కుటుంబ సభ్యులను జైలుకి పంపిన దేశభక్తుల ఇంట్లో - మూడు తరాలుగా విప్లవ సాహిత్య చర్చలకు వేదికగా నిలిచిన ముంగిట్లో - ఛాందసాన్ని వెలివేసిన పండిత కుటుంబంలో 193355 తూర్పుగోదావరి జిల్లా ముంగండలో జననం. 1953-55లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫిజిక్సులో మాస్టర్స్ డిగ్రీ: 1960-63లో మాస్కో యూనివర్సిటీ నుంచి డాక్టరేటు డిగ్రీ తీసుకున్నారు. 1969-71లో స్వీడన్లోని ఉప్సలా ఆయనోస్పెరిక్ అబ్జర్వేటరీలోనూ, 1974-75లో బల్గేరియన్ అకాడమీ ఆఫ్ సైన్స్స్ లోనూ: 1981-82లో ఇంగ్లండులోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ వేల్స్ లోనూ స్పేస్ రీసెర్చి చేశారు. ఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ లేబరేటరీలో డిప్యూటీ డైరెక్టరుగా అంతరిక్ష పరిశోధన చేస్తూ, 18 రాకెట్ల ప్రయోగాలలో పాల్గొని, 1993లో రిటైరు అయ్యారు. 15వ ఏట నుంచీ కవిత్వ రచనలో ప్రవేశం ఉన్న నళినీమోహన్ పాప్యులర్ సైన్సులో 30 పుస్తకాలు, పిల్లలకోసం 16 పుస్తకాలు, పద్యకావ్యాలు 4 ప్రచురించారు. గేయకథలు, కవితలు, వ్యాసాలు వగైరా గ్రంథాలు 45కి పైగా రాశారు. వీరి అముద్రితాలు దాదాపు మరో 19 ఉన్నాయి. వివిధ తెలుగు పత్రికలలో వీరి వ్యాసాలు 1600లకు పైగా ప్రచురితం అయ్యాయి. అనువాదాలూ ఉన్నాయి. 1968లో "కవికోకిల దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన బహుమతినీ", వైజ్ఞానిక రచనల ద్వారా ప్రజాబాహుళ్యానికి సైన్సుమీద అభిమానం కలిగిస్తున్నందుకు 1986లో "ఇందిరాగాంధీ విజ్ఞాన బహుమతి”ని ప్రప్రథమంగానూ అందుకున్నారు. ఆంధ్రజ్యోతి వీక్లీ నిర్వహించిన బాలెట్లో 1986లో "తెలుగు వారిలో ప్రముఖవ్యక్తి” గా ఎన్నికయ్యారు. 1992లో పిల్లలలో సైన్సు భావాల వ్యాప్తికి ఉత్తమ కృషి చేస్తున్నందుకు N.C.S.T.C వారిచే జాతీయ అవార్డును అందుకున్నారు. 1993లో హాస్యరచనలకై తెలుగు యూనివర్సిటీ వారి "బులుసు బుచ్చిసుబ్బారాయుడు ప్రతిభా పురస్కారాన్నీ”, 1994లో "నన్నపనేని మంగాదేవి బాల సాహిత్య పురస్కారాన్నీ”, 2009 జనవరిలో “జమ్మి శకుంతల అవార్డు"నూ అందుకున్నారు. నళినీమోహన్ గారి మరొక హబీ - హోమియో వైద్యం. వీరు 21-10-2005 నాడు తుదిశ్వాస విడిచారు. సుప్రసిద్ధ నవలా రచయిత, జర్నలిస్టు శ్రీ మహీధర రామమోహనరావు గారు వీరి తండ్రి బహుగ్రంథకర్త శ్రీ మహీధర జగన్మోహనరావు గారు వీరి పినతండ్రి. పబ్లిషింగ్ వూ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 4-1-435, విజ్ఞాన భవన్, బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్ - 500 001.