
SCIENCE MANA NESTHAM
₹80
In stock · 14 available
PublisherSHANMUKESWARA PRACHURANALU
LanguageTelugu
వ్యాధులు - డిఎన్ఏ పాత్ర డీఎన్ఏ.. డబుల్ హెలిక్స్... ఈ రెండు మాటలు వినగానే మెలికలు తిరిగిన నిచ్చెనలాంటి ఆకారం మన కళ్ల ముందు మెదులుతుంది. డీఎన్ఏ.. డబుల్ హెలిక్స్ రూపం లోనే ఉంటుంది. నిజానికి డీఎన్ఏ డబుల్ హెలిక్స్ గా మాత్రమే కాకుండా అనేక రకాల ఆకారాల్లో కూడా ఏర్పడుతుంది. ఈ ఆకారాల ప్రాముఖ్యం ఏమిటి... వీటి వల్ల కలిగే పరిణామాలేమిటి. నాలుగు దశాబ్దాల నుంచి శాస్త్రవేత్తలు వీటి గురించి పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఇటీవల చేసిన కొన్ని పరిశోధనల్లో వీటిలో కొన్నింటికి సమాధానాలు దొరికాయి. 1970లలో టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్శిటీ రాబర్ట్ వెల్స్ అనే శాస్త్రవేత్త డీఎన్ఏ పోగులపై కొన్ని ప్రయోగాలు చేశారు. అనువంశిక Addan లక్షణాల్ని తరతరాలకి అందించే ఈ డీఎన్ఏ పోగులు 'డబుల్ హెలిక్స్' రూపంలో ఉంటాయని వాట్సన్, క్రిక్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు అప్పటికే కనుక్కున్నారు.