
SCIENCE VAITALIKULU
by SREE MADHULATHA PUBLICATIONS
₹50
In stock · 6 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
సైన్స్ వైతాళికులు ఉపోద్ఘాతం క్రీస్తుపూర్వం 384 నుంచి 332 వరకు జీవించి వున్న అరిస్టాటిల్ను చాలా విజ్ఞాన శాస్త్రరంగాలలో తొలిశాస్త్రవేత్తగా పరిగణిస్తారు. ఒక్క విజ్ఞానశాస్త్ర రంగాలేకాక చాలా యితర శాఖలలో కూడా విశిష్టమైన కృషి చేసినవారు అరిస్టాటిల్. అయితే అరిస్టాటిల్ ముందు వైజ్ఞానిక వైతాళికులు ఎవరూ లేరా? గ్రీకులు గణితం, సాహిత్యం, కళలు, వేదాంతం, విజ్ఞానశాస్త్రం యిలా పలు రంగాలలో గణనీయమైన కృషిచేసినవారున్నారు. అయితే ఒకరకంగా విజ్ఞానశాస్త్ర విషయాలలోనే వారికృషి సాపేక్షకంగా తక్కువ. వారి భావనలు అస్పష్టంగా వున్నా, ప్రయోగాత్మకంగా పరీక్షించకపోయినా క్రీ.శ.1400 దాకా భౌతిక అంశాలు ఏవైతే తెలుసో అవన్నీ గ్రీకుల రాతలలో కన్పిస్తాయి. అంటే చాలా మౌలికమైన భావనలు- పదార్థనిత్యత్వం, జడత్వం, అణుసిద్ధాంతం, కాంతి నిర్దుష్టవేగం... వంటి భావనలను గ్రీకుల రచనలలో చూడవచ్చు. అరిస్టాటిల్ క్రీ.పూ. 640-546 దాకా జీవించిన థేల్స్ (Thales) గురించి అరిస్టాటిల్ కొన్ని విషయాలు రాశాడు. అయస్కాంతపు ఆకర్షణశక్తిని పసిగట్టినట్టు చెబుతారు. ఇంకా భూమికోడిగుడ్డు ఆకారంలో గుండ్రంగా వుందని పేర్కొన్నట్టు చెబుతారు. అయితే భూమి స్తూపాకారంలో వుండి, నీటిలో వుందని థేల్స్ పేర్కొన్నట్టు అరిస్టాటిల్ చెప్పాడు. తర్వాత వచ్చిన గొప్ప శాస్త్రవేత్త పైథాగరస్ (Pythagoras). పైథాగరస్ క్రీ.పూ. 500-428 సిద్ధాంతం ప్రకారం భూమి గోళాకారంగా వుందని పరిగణించబడింది. అయితే దీనికి ఆధారం ఏమిటో వివరించబడలేదు. అయితే అన్ని రూపాలలో గోళాకారం చాలారకాలుగా సౌష్టవంగా వుందని భావించడంవల్ల అలా భావించాడేమో తెలియదు. ఇంకా సర్వవిశ్వాంతరాళం గోళాకృతిలో వుందని, దానికి భూమి కేంద్రమని, ఇంకా సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు తమ వృత్తాకార కక్ష్యలలో భూమికేంద్రంగా పరిభ్రమిస్తున్నాయని కూడా పైథాగరస్ పేర్కొన్నాడు. గణితంలో జ్యామెట్రీలో పైథాగరస్ సిద్ధాంతం - కర్ణవర్గ సిద్ధాంతం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరో ప్రముఖ గ్రీకు శాస్త్రవేత్త అనాగగోరస్ (Anaxagoras). ఇతని జీవిత కాలం 500-428 క్రీ.పూ. విజ్ఞానశాస్త్రం కొరకు అనాగగోరస్ తన ఆస్తిని ధారపోశాడని ప్లేటో పేర్కొన్నాడు. ఇతను చంద్రుడు స్వయంగా ప్రకాశించలేడని భావించాడంటారు. చంద్రునిలో ప్రకాశానికి కారణం సూర్యుడనీ, భూమి మధ్యలో రావడంవల్ల చంద్రగ్రహణం, సూర్యుడికి చంద్రుడు అడ్డంగా రావడంవల్ల సూర్యగ్రహణం అని వివరించాడు. ఇంకా సూర్యుడు భగభగమండే రాయి అనీ, కానీ చంద్రుడు భూమిలాంటి వాడనీ కూడా భావించాడు. ఈ కారణంగా అతనిని ఏథెన్స్ నగరం నుంచి బహిష్కరించారు.