SCIENCELO SAHASALU - ANDINA AKASAM by R.V.RAMARAO Telugu book cover

SCIENCELO SAHASALU - ANDINA AKASAM

by R.V.RAMARAO

₹30
In stock · 28 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
రాకెట్లు చేసే పని * 1. రఘురాంగారు భోజనం ముగించి ఆరు బయటకు వచ్చి కూర్చున్నారు. ఆరోజు వెన్నెల లేదు. ఆకాశం నల్లగా వుంది. దానిపైన తెల్లగా రకరకాల నక్షత్రాలు కన్నుల పండుగ జేస్తున్నాయి. ఆయన వాటివంక చూస్తూ ఆలోచిస్తున్నారు. "ఏమిటి నాన్నా! దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్” అంటూ కోటి వచ్చాడు. "ఏమీ లేదురా! ఆకాశం చూడు... ఆ నక్షత్రాలు చూడు... వాటిల్లో కొన్ని గ్రహాలూ వున్నాయి. వీటిన్నిటిని చూస్తుంటే మానవులు వాటిని చేరుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికి సఫలమవుతాయో? అనిపిస్తున్నది" రఘురాంగారు. తన ఆలోచనలను కోటికి వివరించాడు. "ఇంతకీ మానవులు ప్రయత్నాలు సాగిస్తున్నారంటావా? మరి లేకే ఇంతకు ముందు మనం చెప్పుకున్న రాకెట్లు తో దానికోసమే గదా! రూపు దిద్దుకున్నాయి."