
SCIENCELO SAHASALU - JET VIMANALU
₹30
In stock · 41 available
PublisherRAINBOW PUBLICATIONS
LanguageTelugu
ఆకాశంలో తెల్లని ధార ఊరికి దూరంగా మైదానం ఉన్నది. ఆ మైదానంలో రోజూ పిల్లలు ఆడుకొంటూ ఉంటారు. ఒకరోజు సాయంత్రం మామూలుగా ఆటలు ఆడుకొంటున్నారు. ఇంతలో ఉన్నట్లుండి ఆకాశంలో ఓ వింత వాళ్ళ కంటబడింది. అది చూచిన ఒక పిల్లవాడు చప్పట్లు చరుస్తూ: "అరే! అరే! రాకెట్ అదిగో పోతున్నది. చూడండిరా!" అని అరిచాడు. మిగతా పిల్లలంతా తలలు పైకెత్తి చూశారు. వాళ్ళుగూడా “రాకెట్... రాకెట్..." అంటూ కేకలు వేయటం సాగించారు. ఇంతకీ వాళ్ళకు ఆ ధార ముందు భాగంలో ఏమి కనుపించలేదు. మరి అది కంటికి కనుపించనంత ఎత్తులో వెళుతున్నదన్నమాట. ఆ తెల్లని ధార ఉన్న కొద్దీ పొడుగై ఎక్కడో మాయమై పోయింది. అక్కడ శ్రీనివాస్ అనే పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య “ఎయిర్ ఫోర్సు"లో పనిజేస్తున్నాడు. శ్రీనివాస కు విమానాల గురించి ఒక పుస్తకం. తెచ్చి ఇచ్చాడు.