SEEMA KATHALU by SINGAMANENI NARAYANA Telugu book cover

SEEMA KATHALU

by SINGAMANENI NARAYANA

₹100
In stock · 655 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నీళ్ళు తెల్లారింది ! అయిదు గంటలకే కీ ఇచ్చి పెట్టిన గడియారం అలారం మోగుతాంది. ఏదో పీడకలలోంచి మేలుకున్నట్టు నా భార్య గబుక్కున లేచి కూర్చుంది. హీరేహాల్ మండలంలో టైపిస్టుగా నా ఉద్యోగం. ఎనిమిది గంటలు అయ్యేసరికి టిఫిన్ తోపాటు భోజనం కారియర్ కూడా సిద్ధంగా వుండాల నా కోసం. నేను రాయదుర్గం నుంచి హీరేహాల్కు వెళ్ళాల్సిన బస్సు ఎనిమిదిన్నరకే. అందుకే ఆమెకు అంత గాభరా ! "అక్కా! అక్కా!! నీళ్ళు! నీళ్ళు!! నీళ్ళు వస్తాండాయి" పక్కింటి వెంకటేశులు తలుపు కొడుతున్న శబ్దం! బయటనుంచీ హడావుడిగా కేకలు విన్పిస్తున్నాయి. ఏదో పండుగ సంరంభం మాదిరి. ధన్వర్ష సూపర్ బంపర్ లాటరీ తగిలిన వార్త విన్నట్టు పరుగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. అప్పటికే బిందెలు చప్పుడు చేసుకుంటూ పరుగెత్తుతున్న వెంకటేశుల అడుగుల చప్పుడు! "లెండి లెండి నీళ్ళు వస్తున్నాయంట. దారికి అడ్డం, దోమతెర తీసెయ్యండి" అంటూ లోపలికి పరుగెత్తి రెండు క్షణాల్లో మూడు బిందెలు, తీసికొని దోమతెర కిందినుంచీ దూరి బైటకొచ్చి "పిల్లోల్లు లేస్తారేమో, కొంచెం చూస్తా వుండండి" అని గబ గబ వెళ్ళిపోయింది. నాకింకా నిద్రమత్తు పోలేదు. గుండెలో గుబులు. ఈ బాబుగాడు లేస్తే ఫరవాలేదు. చిన్ని లేస్తే ఎట్ల? దానికి సంవత్సరం దాటింది. అంతే! వాళ్ళ అమ్మ తప్ప మిగతా వాళ్ళెవరూ విశ్వాసపాత్రులుగా కన్పించరు దానికి, వాళ్ళ అమ్మ క్షణం కన్పించకపోతే ఫ్యాక్టరీ సైరన్ మాదిరి గుయ్యిమంటుంది. దోమతెర తీసేసి నేను వాళ్ళ పక్కనే పడుకున్నాను, బద్ధకంగా కళ్ళు మూసుకుని. ది నిమిషాలు దాటింది. కాలకృత్యానికి కడుపులో కదలిక మొదలైంది. మాకూ, మా పక్క పోర్షన్లో బాడుగకు వుంటున్న వాళ్ళకు ఇద్దరికీ కలిపి కామన్గా ఒకే సెప్టిక్ లెట్రిన్ వుంది. లెట్రిన్లో లో నీళ్ళ బాన వుంటుంది గానీ అందులో నీళ్ళుండవు చాలాసార్లు. బానలోకి నీళ్ళు ఆ పక్కింటి ఆమె పోస్తుందిలే అని నా భార్య, నా భార్య నింపుతుందిలే అని ఆ క్కంటి ఆయమ్మ? ఇద్దరూ ఇద్దరే! రెండు బిందెలు పాపం! ఏ ఇల్లాలు మాత్రం అంత ధారంగా ఆలోచించగలదు, ఈ నీటి కరువులో? లేచి బాత్ రూమ్కు పోయి తొట్టిలోకి తొంగిచూస్తే ఒక్క నీటి చుక్క లేదు. ఖాళీ! ంటింట్లోకి పోయి బిందెలోంచి నీళ్ళు వంచుకుంటూంటే, అప్పుడప్పుడే వచ్చిన నా కార్య ఏదో ఘోర ప్రమాదం జరగబోతున్నట్టు అరిచింది.