
SEEMA KATHALU - 40.00
₹40
In stock · 2 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
* SEEMA KATHALU * రాయలసీమ సామాన్య జనజీవన చిత్రణ ఆశయంగా సంకలనం చేసిన పద్దెనిమిది కథల సంపుటి 'సీమ కథలు'. దోపిడీ, అవినీతి, ఆశ్రితజనపక్షపాతం, అణచివేత, వ్యవస్థలో అంతర్భాగాలైపోగా, ప్రకృతి సహాయనిరాకరణ, భయంకర మైన కరువు కాటకాలు కూడా ఈ జనానికి ప్రత్యేక శత్రువులు. నమ్మకాలు, సంప్రదాయాలు, ఆచారాల గుది బండల్ని ఇంకా మోస్తూ, భూస్వామ్య సంస్కృతి ఛాయల్లో బ్రతుకుతున్న పీడిత జన జీవితాన్ని ఆర్తితో చిత్రించిన సజీవ చిత్రాలు యివి. ఆంధ్రజ్యోతి వీక్లీ తిరుపతి తప్ప రాయలసీమ ప్రాంతంలో మరేప్రదేశంపట్ల సరైన అవగాహన లేనివారికి 'రాయలసీమ దర్శనం' లాంటిది ఈ సీమ కథల సంకలనం. ఇంకిపోయిన చెరువులు, ఎండిపోయిన పంటపొలాలు, అన్నమో రామచంద్రా అని అలమటించే మనుషులు, పశువులను, ఇంతవరకూ కళ్ళరా చూడని వారికి, ఇధియోపియాను మరపించే రాయలసీమ ప్రజల జీవన సంచలనాన్ని గురించి కళ్ళకు కట్టినట్టు చెప్పింది ఈ సంకలనం. _—ఇండియా టుడే ఈ సంకలనంలోని 'నీళ్ళు' కథ నుంచి 'ప్రతిజ్ఞ' కథ వరకు ప్రతికథా ఒక అక్షర చిత్రం. ఈ సంపుటిలోని ప్రతి కథనుంచి ఒక వాక్చిత్రం ఇవ్వవచ్చు. ఈ కథలు చదివితే రచన ఎంతటి సామాజిక బాధ్యతను సున్నితంగా నెరవేర్చగలదో అర్ధం అవుతుంది.