
SEEMAKATHA - ASTHITWAM
₹120
In stock · 288 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Asthitvam Dr. Kinnera Sreedevi రాయలసీమ చరిత్ర, సంస్కృతి, రాయలసీమ సమస్యలు, వాటి మూలాలు, వాటి పరిష్కారాలు వీటికి సంబంధించి శ్రీదేవి సాధికారికమైన సమాచారాన్ని సమకూర్చి పెట్టింది. శాస్త్రీయమైన ఆలోచనల్ని వెలిబుచ్చింది. శ్రీదేవి విమర్శ పాఠకుల మీద ఒక ప్రభావ ముద్ర వేస్తుంది. ఈ పుస్తకమంతా చదివిన తర్వాత ఇందులో చర్చింపబడిన కథలన్నిటినీ సేకరించి ఒక్కసారిగా చదువుదామన్న ఆసక్తి కలిగిస్తుంది. సాహిత్యాన్ని చదివింపజేయడం కన్నా మించిన ప్రయోజనం సాహిత్య విమర్శకేముంటుంది. ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ఈ వ్యాససంపుటి చదవడం పూర్తయినాక... రాయలసీమ కథకులమీద ఈర్ష్య కలిగింది. శ్రీదేవిగారిమీద గౌరవం పెరిగింది. కళింగాంధ్ర సాహిత్యం యావత్తుమీద దేవుడెరుగు (వుండుంటే...) కనీసరం కథాసాహిత్యం మీదనయినా ఈ 'రాయలసీమ కథలు, ప్రాంతీయ ముద్రలు - ప్రత్యేకతలు' వంటి సవివరమైన, సహేతుకమైన, సంహితమైన పరామర్శ, సమీక్షా, విమర్శా... మునుపు లేదు, నేడు లేదు, రేపూ లేదు (ఔను... వుండదు)... అంచేత శ్రీదేవిగారూ మా కళింగాంధ్రాకు చెందివుంటే యెంత బాగుణ్ణన్పించింది. అట్టాడ అప్పల్నాయుడు శ్రీదేవికి కథాశిల్పం గురించి మంచి అవగాహన ఉంది. కథల్లో శిల్పపర లోపాలను ఎత్తి చూపటానికి వెనుదీయని నిర్భీతి ఉంది. నిష్కర్శ ఉంది. ఇవి మంచి విమర్శకుల లక్షణాలు. డా|| సుంకిరెడ్డి నారాయణరెడ్డి