
SEEMEN KATHALU
₹100
In stock · 47 available
PublisherADDEPALLI PRABHU
LanguageTelugu
విధ్వంస అభివృద్ధిపై నిరసన ఈ కథలో బూరయ్య చెప్పినట్టు మనం 'అభివృద్ధి నిరోధకులం' కావాలి. ఇది తప్పనిసరి. "అవును ! మేం అభివృద్ధి నిరోధకులమే. పర్యావరణాన్నీ, జీవావరణాన్నీ నాశనం చేసి ఒకరో ఇద్దరో సేట్లు అభివృద్ధి సాధించి ప్రపంచ కుబేరుల లిస్టులో చోటు చేసుకుంటే ఆహా! అని అబ్బురపడలేం. అలాంటి అభివృద్ధికి ఖచ్చితంగా వ్యతిరేకులమే.” అన్న మాటలు శిరోధార్యం. అభివృద్ధి రథచక్రాల కిందపడి నలిగిపోయేవారు అభివృద్ధిని వ్యతిరేకిస్తారు. అందుకే ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతోనో, ప్రాజెక్టుల పేరుతోనో జరిగే అభివృద్ధిని వ్యతిరేకించడం అవసరం, అనివార్యం. టేకుమట్ల సాంబయ్య, నల్లగొండ 'ఊరు గోదారి' చాలా మంచి కథ అద్దేపల్లి ప్రభు 'ఊరు గోదారి' చాలా మంచి కథ. గోదావరి ఒడ్డునే వుండేవాళ్ళకు సొంతగడ్డ అనే మమకారంతో కథ మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా ఉంది. నన్నివేశాలు మనసుకెంతో ఆనందాన్ని కలిగించాయి. కవిత్వంతో పోలిస్తే కథలు ఎక్కువ మంది పాఠకులకు చేరతాయి. ఈ మధ్య వచ్చిన మంచి కథల్లో ఇదొకటి, పాఠకుల మనసుల్ని కదిలించే ఇలాంటి కథలు మరిన్ని సదరు రచయిత నుండి రావాలని ఆశిస్తున్నాం.. - డా. మానేపల్లి, ఎలమంచిలి